తాత సపోర్టు ఉందికానీ... రాజకీయాల్లోకి రాను!

By Bojja Kumar

హైదరాబాద్: తాత కరుణానిధి రాజకీయాల్లో ఉన్నా తనకు మాత్రం రాజకీయాలపై ఆసక్తిలేదని, తన దృష్టంతా సినిమాలపైనే వుందని, ప్రస్తుతం ఉన్న నటీనటులందరినీ గమనిస్తూ తనను తాను తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని హీరో ఉదయనిధి స్టాలిన్ తెలిపారు.

హన్సిక, ఉదయనిధి స్టాలిన్ జంటగా సాయిగణేష ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగులో అందిస్తున్న చిత్రం 'ఓకే ఓకే'. తమిళంలో విజయవంతమైన 'ఒరుక్కల్ ఒరుకన్నాడి' చిత్రాన్ని తెలుగులో నిర్మాత బెల్లంకొండ సురేష్ అందిస్తున్నారు. రాజేష్ ఎం. దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం 31న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ పాత్రికేయులతో ముచ్చటించి పలు విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళంలో విజయవంతమైన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీగా అందర్నీ ఆకట్టుకుంటుందని, తమిళంతోపాటు తెలుగులో కూడా విజయవంతమవుతుందన్న నమ్మకం వుందని తెలిపారు.

నిర్మాతగా ప్రస్తుతం రెండు చిత్రాలను నిర్మిస్తున్నానని, మంచి స్క్రిప్ట్‌లకోసం, దర్శకులకోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. డిఫరెంట్ ఫిలింస్ అందిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నంలో తన కుటుంబం తనకు పూర్తి సహకారం అందిస్తుందని, ముఖ్యంగా హీరో అయిన తర్వాత వారందరూ సంతోషించారని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X