ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ పై రాజుకున్న జాతీయతా వివాదం ఊపందుకుంటోంది. ఈ ఏడాది పద్మశ్రీ అవార్డులు లభించే అవకాశమున్న వారి జాబితాలో ఆయన పేరు కలిపేందుకు వీల్లేందంటూ వివాదం చోటుచేసుకుంది. ఆయన భారతీయుడు కాదని,దక్షిణ నేపాల్ లో పుట్టినట్లు వార్తలు వినపడుతున్నాయి. దాంతో ఆయనకు దేశ పురస్కారాలు అందుకునే అర్హత లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే ఉదిత్ మాత్రం తాను బీహార్ లోనే పుట్టానని,గిట్టనివారే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. ఈ నేపధ్యంలో అవార్డ్ కమిటి అంతా తలలు పట్టుకు కూర్చుంటున్నారు. ఉదిత్ నారాయణ్ ఆడువారి మాటలుకు అర్దాలే వేరులే(ఏమైందో ఈ వేళ..),ఆది (పట్టు ఒకటో సారి..),ఆట(ముధ్దులాట..ముధ్దులాట),రంగా రెడ్డి జిల్లాలోకి(ఆయుధం) వంటి అనేక తెలుగు సినిమాల్లో మంచి పాటలు పాడి అభిమానులను ఉర్రూతలూగించారు.