twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పుడిక "ఉడ్తా బాలీవుడ్": అనురాగ్ కోసం కదిలిన బాలీవుడ్ ప్రముఖులు

    |

    "ఉడ్తా పంజాబ్" వివాదం తో బాలీవుడ్ లో కూడా కదలిక వచ్చింది. సినిమా కోసం బాలీవుడ్ నటులు, దర్శకులు అంతా మద్దతుగా నిలుస్తున్నారు.. మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అనురాగ్ కశ్యప్ పై అసత్య ఆరోపణలు చేసిన సెన్సార్ బోర్డు చైర్మన్ పహ్లజ్ నిహలానీ క్షమాపణలు చెప్పాలని, ఆయనను పదవి నుంచి తప్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అశోక్ పండిట్ నేతృత్వంలో నటులు, దర్శకులు కలిసి మీడియాతో మాట్లాడారు.

    మన దేశం కూడా ఇన్ని రకాల నిర్భందాలతో సౌదీ అరేబియాలా మారరాదని దర్శకుడు మహేశ్ భట్ అన్నారు. లేని అవాస్తవాలను కాదనీ,సమాజంలో జరిగిన వాటినే తాము సినిమాలుగా మలుస్తున్నామని, ఊహించి లేదా సృషించి సినిమాలు తీయడం లేదని మరో దర్శకుడు రాహుల్ దొలాకియా తెలిపారు.హీరో షాహిద్ కపూర్ కూదా ఈ సినిమాలోని సందేశం అందరికీ చేరేలా సహకరించాలని విజ్ఞప్తి చేశాడు.

    ఉడ్తా PM కి సమాధానం చెప్పిన అనురాగ్ కాశ్యప్ఉడ్తా PM కి సమాధానం చెప్పిన అనురాగ్ కాశ్యప్

    ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నుంచి అనురాగ్ కశ్యప్ లంచం తీసుకున్నారని ఆరోపణలు చేసి సినిమా పరిశ్రమను నిహలానీ అవమానించారని, దానికి ఆయన ఖచ్చితంగా నురాగ్ కి క్షమాపనలు చెప్పాలనీ నటుడూ,దర్సకుడూ అశోక్ పండిట్ మండిపడ్డారు. సెన్సార్ బోర్డు పదవికి నిహలానీ తగరని ముఖేశ్ భట్ కూడా అభిప్రాయ పడ్డారు.

     "Udta Punjab" gets Bollywood's support

    అయితే ఇక్కడ మరో విచ్ఝిత్రం ఏమితంటే సినీ పరిశ్రమ అంతా 'ఉడ్తా పంజాబ్' కోసం ఒక్కటై తమ మద్దతు తెలుపుతుంటే. వివాదంపై స్పందించేందుకు నిర్మాత ఏక్తా కపూర్ నిరాకరించింది. ఈ వివాదంపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని తెలిపింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 89 కట్స్ చెప్పడంతో దుమారం రేగింది.

    సహ నిర్మాత అనురాగ్ కశ్యప్ బహిరంగంగా సెన్సార్ బోర్డుపై ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో అనురాగ్- ఏక్తా కపూర్ మధ్య విభేదాలు తలెత్తాయని, ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకోనున్నారని వార్తలు కూడా వచ్చాయి.,,దీనిపై స్పందించేందుకు ఏక్తా నిరాకరించింది. 'మా అభిప్రాయాలను అధికార ప్రతినిధి ద్వారానే వెల్లడించాలని నేను, కశ్యప్ నిర్ణయించుకున్నాం.

    కాబట్టి ఈ వివాదంపై నేను మాట్లాడను. ఈ సమస్యకు సామరస్య పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నా. నేను అనవసరంగా ఎటువంటి కామెంట్స్ చేయన'ని స్పష్టం చేసింది. మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన తన తాజా చిత్రం 'ఎ స్కాండల్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొంది.

    English summary
    Bollywood filmmakers including Mahesh Bhatt and Karan Johar on Tuesday spoke out against the censorship issues that the film Udta Punjab is facing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X