»   » ఉగాది పండగ కళ మొత్తం అక్కినేని కుటుంబంలోనే.. ఆ రోజు ఏం చేయబోతున్నారంటే!

ఉగాది పండగ కళ మొత్తం అక్కినేని కుటుంబంలోనే.. ఆ రోజు ఏం చేయబోతున్నారంటే!

Subscribe to Filmibeat Telugu

అక్కినేని కుటుంబంలో ఈ ఉగాది మరింత జోష్ పెంచబోతోంది. నాగార్జునతో పాటు వారసులు ఇద్దరూ కలసి అభిమానులని ఆశ్చర్యపరచబోతున్నారు. నాగార్జున ప్రస్తుతం రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తరువాత నాగ్, నాని కాంబినేషన్లో మల్టి స్టారర్ చిత్రం రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ఉగాది సంధర్భంగా ప్రారంభించనున్నారు.

ఇక నాగచైతన్య సవ్యసాచి చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు. అఖిల్ తొలిరెండు చిత్రాలతో సరైన విజయాన్ని అందుకోలేకపోయారు. దీనితో మూడవ చిత్ర విషయంలో అఖిల్ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

Ugadi treat for Akkineni fans

తొలిప్రేమ చిత్రంతో ఘనవిజయం సాధించిన దర్శకుడు వెంకీ అట్లూరితో అఖిల్ తరువాతి చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఉగాది రోజు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఈ ఉగాది అక్కినేని కుటుంబంలో నిజంగానే పండగ కళ తీసుకురాబోతోందన్నమాట.

English summary
Ugadi treat for Akkineni fans. All heros will going to surprise fans
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu