ఉలిక్కి పడటం ఖాయం: లక్ష్మి ప్రసన్న
'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా' చిత్రం చూసిన వారంతా ఉలిక్క పడటం ఖాయమని, ఆ రేంజిలో సినిమా రూపొందించామని అంటోంది ఆ చిత్ర నిర్మాత మంచు లక్ష్మి ప్రసన్న. నన్హీకలి సంస్థ, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సామాజిక బాధ్యత కార్యక్రమానికి నిధులు అందించటంలో భాగంగా ఓ హోటల్‌లో ఫ్యాషన్ యాత్ర పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా తన సినిమా విశేషాలను కూడా ఆమె వెల్లడించారు.
'నగరంలో ఎన్నో ఫ్యాషన్ బొటిక్‌లు ఉన్నప్పటికీ మనకు కావాల్సిన స్టఫ్ అంతా దొరకదు. కానీ.. ఈ ఫ్యాషన్ యాత్రలో దేశవ్యాప్తంగా ఉన్న డిజైనర్లు అరుదైన కలెక్షన్‌ను తీసుకొచ్చారు. అన్నీ చాలా బాగున్నాయి..' అని అన్నారు. మారుతున్న ఫ్యాషన్‌ల ఫాలో అవుతుంటానని చెబుతూ 'నీట్‌గా ఉండాలని కోరుకుంటాను. అందంగా, ట్రెండీగా ఉండటానికి ఇష్ట పడటాను, సినిమాల్లో మాత్రం నేనే వేసుకునే నా కాస్ట్యూమ్స్ బాధ్యత ఆ ప్రొడక్షన్ చూసుకుంటుంది..'అని అన్నారు.
ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ చిత్రం బాలయ్య, మనోజ్ నటన ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని, భయాన్ని కలిగిస్తాయని ఇటీవల విడుదలైన ఆ చిత్రం ట్రైలర్స్ చూస్తే స్పష్టం అవుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని గాంధర్వ మహల్‌పై బాలకృష్ణ విపరీతమైన కోరికను పెంచుకుంటాడని, దానిపై ఎవరైనా కన్నేస్తే సహించలేని మనస్తత్వంతో ఉంటాడని తెలుస్తోంది. మనోజ్ కిరాయి హంతకుడి పాత్రలో భయంకరమైన గెటప్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సంగీతం బెబో శశి. నిర్మాణ సంస్థ: మంచు ఎంటర్‌టైన్మెంట్స్, నిర్మాత: మంచు లక్ష్మి, దర్శకత్వం: శేఖర్ రాజా


Click it and Unblock the Notifications











