బాలకృష్ణ కొత్తమూవీ ప్రీమియర్ షో డీటేల్స్
బాలకృష్ణ ప్రధాన పాత్రలో మంచు మనోజ్, దీక్షా సేథ్ జంటగా రూపొందుతున్న చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా'. ఈచిత్రం ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్, డివీడి రైట్స్ 'కూల్ పిక్స్ సినిమాస్' సంస్థ దక్కించుకుంది. అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షో జులై 26న వేస్తున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. వివరాలకు శ్రీమాన్ యార్లగడ్డ(410-739-4269) సంప్రదించవచ్చు అని పేర్కొంది.
బాలకృష్ణ, మనోజ్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీలో బాలకృష్ణ నటన చిత్రానికి హైలెట్‌గా నిలవనుంది. అదే విధంగా మంచు మనోజ్ రాకింగ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. గతంలో ఏ చిత్రంలోనూ చూడని విధంగా బాలకృష్ణ, మనోజ్ పాత్రలను చిత్రీకరించారు.
మంచు లక్ష్మీ ప్రసన్న భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని మంచు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. మంచు కుటుంబ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఇదే భారీ బడ్జెట్ చిత్రం. ఈ చిత్రం కోసం రూ. 6.5 కోట్లు ఖర్చు చేసి 'గాంధర్వ మహల్' సెట్ వేశారు.
ఈ చిత్రానికి సంబంధించిన సంగీతం ఇప్పటికే విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. కథ, దర్శకత్వం శేఖర్ రాజా, బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు. బెబో శశి సంగీతం అదించగా, బాలీవుడ్ సంగీత ద్వయం సలీమ్-సులేమాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











