'ఊకొడతారా..ఉలిక్కి పడతారా' రిలీజ్ డేట్ ఛేంజ్

By Srikanya

మంచు మనోజ్, దీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఊకొడతారా.. ఉలిక్కి పడతారా'. బాలకృష్ణ అతిథి పాత్రలో రూపొందిన ఈ చిత్రం రిలీజ్ మొదట ఆగస్టు 2 అని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ని జూలై 27 కు ముందుకు జరిపారు. రవితేజ తాజా చిత్రం దేముడు చేసిన మనుష్యులతో క్లాష్ ఎందుకనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దేముడు చేసిన మనుష్యులు చిత్రం ఆగస్టు 3న విడుదల అవుతోంది.

ఇక ఇప్పటికే 'ఊకొడతారా.. ఉలిక్కి పడతారా'ట్రైలర్స్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పద్మశ్రీ డా.ఎం. మోహన్ బాబు సమర్పణలో మంచు మనోజ్, దీక్షాసేత్ హీరో హీరోయిన్లుగా శేఖర్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకుడు శేఖర్ రాజా చెప్పిన పాత్రలోని ఉదాత్తతకు ఆకర్షితులై 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా'లో నటించడానికి నందమూరి బాలకృష్ణ అంగీకరించారు. గత నెలలో ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా నిర్మాత లక్షీప్రసన్న మాట్లాడుతూ..'ఒక విజయవంతమైన సినిమాకి కావాల్సిన సమస్త అర్హతలు, ఆకర్షణలతో 'ఊకొడతారా..ఉలక్కి పడతారా' రిలీజ్‌కు రెడీ అయింది మా సినిమా. మా కుటుంబానికి ఎంతో ఆత్మీయమైన మా అన్నయ్య బాలకృష్ణ గారు ఇందులో చేసిన పాత్రకు చాలా హై ఓల్టేజ్ రెస్పాన్స్ వస్తుందనడంలో సందేహం లేదు. మా నాన్నగారు చేసిన 'పెద్దరాయుడు' కేరక్టర్ ఎంత మెమొరబుల్ కేరక్టరో ఇందులో బాలకృష్ణ చేస్తున్న పాత్ర కూడా అంతే మొమోరబుల్ కేరక్టర్ గా నిలిచి పోతుంది. జూన్ ఆఖరి వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానిక ప్లాన్ చేస్తున్నాం. ఇందులో నేను ఓ ప్రత్యేక పాత్రను పోషించాను'అన్నారు.

బాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ... 'శ్రీరామ రాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ వరం' అని అన్నారు. అలాగే ఊ కొడతా రా... ఉలిక్కి పడతారా చిత్రం భారీ ఎత్తున తెరకెక్కిం దన్నారు. ఈ చిత్రాన్ని మంచు లక్ష్మీప్రసన్న నిర్మిస్తున్నారన్నారు. తండ్రి మోహన్‌బాబు క్రమశిక్షణను పునికి పుచ్చుకున్న లక్ష్మీప్రసన్న ఈ చిత్రా న్ని ఖర్చుకు వెనుకాడకుండా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.

ఈ చిత్రం కోసం రూ.6 కోట్ల వ్యయంతో గంధర్వ మహల్ సెట్‌ను వేసినట్లు చెప్పారు. మంచు మనోజ్ మరో హీరోగా చక్కగా నటించారని బాలకృష్ణ ప్రశంసించారు. ఊ కొడతారా... ఉలిక్కి పడతారా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రం అవుతుందన్నారు. ఇక బాలకృష్ణ నటించిన అధినాయకుడు చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సంగీతం బెబో శశి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X