ప్రకాష్ రాజ్ 'ఉలవచారు..' ఫస్ట్ లుక్(ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్: ప్రకాష్‌రాజ్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఉలవచారు బిర్యాని'. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో స్నేహ హీరోయిన్. ప్రకాష్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంయుక్తంగా నిరిస్తున్న ఈ చిత్రానికి వల్లభ నిర్మాత. ఈ నెల 26న ప్రకాష్‌రాజ్‌ జన్మదినం సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ని చిత్ర యూనిట్ విడుదలచేసింది.

చిత్ర సమర్పకులు కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ''నటుడిగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న ప్రకాష్‌రాజ్‌ ఈ చిత్రంతో దర్శకునిగానూ ప్రతిభ చూపనున్నారు. ఇళయరాజా సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఈ నెల 31న పాటల్ని విడుదల చేస్తామ''న్నారు.

ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. స్నేహ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించటం ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. మళయాళంలో విజయవంతమైన చిత్రం కావటంతో ఇక్కడా అదే రేంజిని ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

స్లైడ్ షోలో ఫస్ట్ లుక్ ఫోటోలు

లవ్ స్టోరీ..

లవ్ స్టోరీ..

ఇది విభిన్న ప్రేమకథాచిత్రం. ఇళయరాజా అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. దాదాపు ఇలాంటి లవ్ స్టోరీ తెలుగు తెరపై రాలేదనే చెప్పాలి.

ఇళయరాజాని...

ఇళయరాజాని...

ఈ నెల 31న ఇళయరాజాగారిని ఘనంగా సత్కరించనున్నారు. అదే వేదికపై ఈ సినిమా ఆడియోను విడుదల చేస్తారు.

రీమేక్

రీమేక్

ఈ ‘ఉలవచారు బిర్యాని' చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘సాల్ట్ ఎన్ పెప్పర్' కు రిమేక్.

మూడు భాషల్లో...

మూడు భాషల్లో...

తెలుగు, తమిళ మరియు కన్నడ బాషలలో రానున్న ఈ చిత్రం ఓ రొమాంటిక్ డ్రామా. ఫన్ తో కూడిన లవ్ ఎలిమెంట్స్ తో నవిస్తూ సరగాదా నడుస్తుంది.

విడుదల..

విడుదల..

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసారు. మే 1 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్రకాష్ రాజ్ నిర్ణయించినట్లు సమాచారం.

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...

ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...

‘ఉలవచారు బిర్యానీ' నేను నా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించాను. మళయాలంలో హిట్టయిన ‘సాల్ట్ అండ్ పెప్పర్' చిత్రానికి ఇది రీమేక్. ఈ "ఉలవచారు బిర్యానీ" కి ‘ లవ్ ఈజ్ కుకింగ్ ‘ అన్న ట్యాగ్ లైన్ తగిలించాం

ఎవరెవరు...

ఎవరెవరు...

స్నేహ, తేజస్, సంయుక్త, ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మాజీ, ఊర్వశి, ఐశ్వర్య, కోటేశ్ మన్నవ, శివాజీరావు యాదవ్, విజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్ర ఫీ: ప్రీతా జయరామన్, నిర్మాత: వల్లభ.

విషెష్

విషెష్

ఈరోజు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రకాష్‌రాజ్‌కి వన్ ఇండియా తెలుగు సంస్థ తరఫున శుభాకాంక్షలు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని వన్ ఇండియా కోరుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X