'ఉల్లాసంగా.. ఉత్సాహంగా" తో పరిచయమైన యశోసాగర్ హీరోగా మరో చిత్రం ప్రారంభం కానుంది. 'ఉల్లాసంగా.." చిత్రాన్ని నిర్మించిన అమృత అమర్ నాద్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రొడక్షన్ వారే తమ ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి 'ఉల్లాసంగా.." కు సంగీతాన్ని అందించిన జి.వి.ప్రకాషకుమార్ సంగీత సారధ్యం వహించనున్నారు. సుకుమార్, 'మంత్ర" తులసీరామ్ ల వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన యన్.ఎస్.నాయుడు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. బి.పి.సోము నిర్మించే ఈ చిత్రానికి వినయ్.పి కార్యనిర్వాహక నిర్మాతగా వ్వహరిస్తారు. ఈ సందర్భంగా ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్.పి మాట్లాడుతూ హీరోయిన్ తోపాటు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. జూన్‌లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుంది"" అన్నారు.