Don't Miss!
- News KTR: రాముడిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో యశోసాగర్ మృతి
యశోసాగర్తో పాటు డ్రైవర్ విశ్వనాథ్, లోకేష్ అనే వ్యక్తి కారులో ఉన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు విశ్వనాథ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. పక్కనే యశోసాగర్ కూర్చున్నాడు. లోకేష్ వెనక సీటులో కూర్చున్నాడు. రాత్రి జర్నీ కావడంతో.... విశ్వనాథ్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో కారు అదుపుతప్పి వంతెనకు ఢీకొట్టింది. విశ్వనాథ్ కూడా ప్రమాదంలో మరణించగా, లోకేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యశో సాగర్ కన్నడ నిర్మాత సోము కుమారుడు. కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన 'ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రంతో హీరోగా పరిచయం అయిన యశోసాగర్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని... మిస్టర్ ప్రేమికుడు, మరికొన్ని చిత్రాల్లో నటించాడు. 'ఉల్లాసంగా ఉత్సాహంగా' తర్వాత అతనికి హిట్లేమీ రాక పోవడంతో ఈ మధ్య అతని సినిమాలేవీ రాలేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంలో స్నేహా ఉల్లాల్ హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం యశోసాగర్ తో పాటు, స్నేహా ఉల్లాల్ కు కూడా తొలి చిత్రమే.