For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR సెన్సార్ రివ్యూ.. రికార్డులూ ఊపిరి పీల్చుకోండి.. మామూలు మాస్ కాదుగా ఇది!

  |

  ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. 'బాహుబలి' తెలుగు సినిమా స్టామినాను విశ్వవ్యాప్తం చేయడమే కాక తన పేరు కూడా ప్రపంచం అంతటికీ తెలిసేలా చేసారు. ఇక ఆయన ప్రస్తుతం RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమా చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. విడుదలకు కొద్ది రోజుల ముందు సినిమా మళ్ళీ వాయిదా పడింది. అయితే ఈ సినిమా సెన్సార్ కోసం ఒక చోట ప్రదర్శించగా ఆ రిపోర్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం పదండి!

  జనవరి 7న భారీ ఎత్తున

  జనవరి 7న భారీ ఎత్తున

  తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షన్ సినిమానే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీంగా, రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా జనవరి 7న భారీ ఎత్తున రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈ సినిమా వాయిదా పడింది.

  పాన్ ఇండియా రేంజ్‌లో

  పాన్ ఇండియా రేంజ్‌లో

  ఇండియన్ సినిమాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నేరుగా విడుదల చేయబోతున్నారు. అలాగే, టర్కిష్, స్పానిష్, పోర్చుగీస్, కొరియన్, జపనీస్, చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో కూడా దీన్ని డబ్బింగ్ చేస్తారని గతంలోనే అధికారికంగా ప్రకటించారు. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహించారు.

  సెన్సార్ బోర్డు మెంబర్

  సెన్సార్ బోర్డు మెంబర్

  ఆ ప్రమోషన్స్ లో భాగంగానే ముంబై, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు లాంటి చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా నిర్వహించారు. అంతా ఓకే అనుకున్న సమయంలో కొన్ని చోట్ల థియేటర్ల మీద ఆంక్షలు విధించడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. తాజాగా ఉమైర్ సంధు అనే స్వయం ప్రకటిత యూఏఈ సెన్సార్ బోర్డు మెంబర్ ఒకరు ఈ సినిమా చూశానని చెబుతూ రివ్యూ ఇచ్చాడు.

   బాక్సాఫీస్ రికార్డ్‌లను బద్దలు

  బాక్సాఫీస్ రికార్డ్‌లను బద్దలు


  గత ఏడాది 29నే దుబాయ్ సెన్సార్ బోర్డ్‌లో RRR సినిమా చూస్తున్నానని ట్వీట్ పెట్టిన అతను RRR ఎన్టీఆర్‌కి చెందినది.. సినిమాకి సోల్ అతనే అని ట్వీట్ కూడా పెట్టాడు. అప్పుడు చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య కాస్త హడావుడి కూడా జరిగింది అనుకోండి అది వేరే విషయం. అయితే తాజాగా ఈ సినిమా ఎలా ఉండనే విషయాన్ని ఆయనే ట్వీట్ పెట్టాడు. సెన్సార్ బోర్డు వద్ద RRR చూసిన తర్వాత, దంగల్ & బాహుబలి2 యొక్క అన్ని బాక్సాఫీస్ రికార్డ్‌లను బద్దలు కొట్టగలదనే ఫీలింగ్ కలుగుతుంది.

  అద్భుతం అని చెప్పి

  అద్భుతం అని చెప్పి

  రామ్ చరణ్ & జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ఫేజ్ లో ఉన్నారు. అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక RRR మూవీ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంటుందట. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టులు అన్నీ పాజిటివ్‌గానే ఉన్నాయని అంటున్నారు. అయితే ఇతను గతంలో అద్భుతం అని చెప్పిన కాటమరాయుడు, అజ్ఞాతవాసి, స్పైడర్, సాహో వంటి సినిమాలు ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూడాలి ఈ సినిమా విషయంలో ఏం జరగనుంది అనేది.

  English summary
  Umair Sandhu Censor Review Tweet On Rrr Movie Became viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X