For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అజ్ఞాతవాసి తొలి రివ్యూ వచ్చేసింది.. పవన్ కుమ్మేశాడు.. బ్లాక్ బస్టర్ (4/5).. బాక్సులు బద్దలే..

  By Rajababu
  |
  అజ్ఞాతవాసి తొలి రివ్యూ వచ్చేసింది.. పవన్ కుమ్మేశాడు..!

  పవన్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం తొలి రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమేర్ సంధూ మొదటి రివ్యూను తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. దుబాయ్‌ సెన్సార్ సభ్యుల బృందంలో ఒకడిగా చెప్పుకొనే ఆయన తెలుగు భారీ చిత్రాలకు సంబంధించిన రివ్యూలను ముందే వెల్లడించడం అనవాయితీగా వస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా అజ్ఞాతవాసి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఉమేర్ సంధూ రివ్యూ వైరల్‌గా మారింది.

   పవన్ వన్ మ్యాన్ షో

  పవన్ వన్ మ్యాన్ షో

  అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కల్యాణ్ ఫెర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ షో. ఇమేజ్‌కు అనుకూలంగా తన నటనతో అదరగొట్టాడు. డ్యాన్సులు ఆయన స్టయిల్‌లోనే ఉన్నాయి. అయితే ఆకట్టుకునే విధంగా డ్యాన్సులు చేయడం విశేషం.

  కీర్తీ, అను గ్లామర్‌గా

  కీర్తీ, అను గ్లామర్‌గా

  ఓవరాల్‌గా పవన్ కల్యాణ్ నటన ఈ సినిమాను మరోస్థాయికి చేర్చింది. హీరోయిన్లుగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ ఫెర్ఫార్మెన్స్, గ్లామర్ అదనపు ఆకర్షణగా మారింది. మిగితా నటీనటులు పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండి సినిమాను మరో మెట్టు ఎక్కించింది.

   మాస్‌కే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్

  మాస్‌కే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్

  కేవలం అభిమానులనే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించే ఎన్నో అంశాలు అజ్ఞాతవాసి చిత్రంలో ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. ఈ చిత్ర కథ, కథనం ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉన్నాయి. ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ పండుగలా ఉంటుంది.

   త్రివిక్రమ్ డైలాగ్స్ అదుర్స్

  త్రివిక్రమ్ డైలాగ్స్ అదుర్స్

  అజ్ఞాతవాసి చిత్రంలోని కీలక సన్నివేశాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ పటాసుల్లా పేలాయి. ఆయన స్టామినాకు ఏమాత్రం తక్కువ మాటలు అద్భుతంగా ఉన్నాయి.

   మాస్‌కు పవన్ పండుగే

  మాస్‌కు పవన్ పండుగే

  ఫస్టాఫ్‌‌లో మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకొనే విధంగా అజ్ఞాతవాసి చిత్రం రూపొందింది. సెకండాఫ్ కూడా అద్బుతమైన స్క్రీన్ ప్లేతో దూసుకుపోతుంది.

  దిమ్మ తిరిగేలా పవన్ ఫైట్స్

  దిమ్మ తిరిగేలా పవన్ ఫైట్స్

  పవన్ కల్యాణ్ చేసిన ఫైట్స్ తెర మీద దిమ్మతిరిగేలా ఉంటాయి. సినిమాటోగ్రఫీ, తివిక్రమ్ డైరెక్షన్ అదిరిపోయేలా ఉంటుంది. అనిరుధ్ అందించిన సంగీతం డిఫెరెంట్‌గా ఉంది.

   అజ్ఞాతవాసి పైసా వసూల్

  అజ్ఞాతవాసి పైసా వసూల్

  ఓవరాల్‌గా అజ్ఞాతవాసి చిత్రం ప్రేక్షకులకు పైసా వసూల్ చిత్రం. ఫ్యాన్స్ ఈలలతో థియేటర్లను మోత మోగించడం ఖాయం. ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో అజ్ఞాతవాసి చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో రికార్డులు తిరగరాసే అవకాశం ఉంది.

  ఉమేర్ సంధూ రేటింగ్

  అజ్ఞాతవాసి చిత్రం రిలీజైన తర్వాత 5 రోజుల్లో కలెక్షన్లు సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయం. తెలుగు సినిమా చరిత్రలో పవన్ కల్యాణ్ చిత్రం అతిపెద్ద హిట్‌గా మారడం ఖాయం. చివరగా నేను చెప్పేమాట ఏంటంటే.. అజ్ఞాతవాసి చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రం అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ చిత్రానికి నేనిచ్చే పాయింట్లు 4/5.

  యూఎస్ టాక్ నేడే

  యూఎస్ టాక్ నేడే

  అజ్ఞాతవాసి చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న రిలీజ్ అవుతున్నది. అయితే ఈ చిత్రం అమెరికాలో జనవరి 9న అంటే ఒకరోజు ముందుగానే విడుదల కానున్నది. భారత కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి సమయానికి అమెరికా నుంచి సినిమా గురించి పూర్తి సమాచారం అందే అవకాశం ఉంది.

   నటీనటులు వీరే..

  నటీనటులు వీరే..

  ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ రూపొందించిన అజ్ఞాతవాసి చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్ సరసన కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యూయేల్ నటించారు. సీనియర్ నటి కుష్భూ కీలక పాత్రను పోషించారు. రావు రమేష్, బోమన్ ఇరానీ, మురళీ శర్మ తదితరులు మిగితా పాత్రల్లో కనిపిస్తారు.

  English summary
  Pawan Kalyan's Agnyaathavaasi movie review comes out. First Review was given by popular critic Umair Sandhu. At the box office, the lack of a credible opposition, perfect release timing [festival period] combined with an extended 5-day weekend will ensure that the film will break records and emerge as the biggest hit of the year so far. He declared Agnyaathavaasi got ‘B-L-O-C-K-B-U-S-T-E-R’ written all over it. Go for it!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more