విజయ్ దేవరకొండతో నిర్మాత ఎఫైర్.. తనతో పడుకోవాలని బలవంతం: సంచలనంగా మారిన ట్వీట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'లైగర్' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఈ చిత్రం మాత్రం అతడికి బిగ్ షాక్‌నే ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ విజయ్ దేవరకొండ ఎఫైర్‌పై ట్వీట్ చేశాడు. ఆ వివరాలు మీకోసమే!

ఎన్నో హిట్లు.. టాలీవుడ్ స్టార్
'పెళ్లి చూపులు' అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చినా.. అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో విజయాలను సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. దీంతో అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ఏకధాటిగా సినిమాలు చేస్తోన్నాడు. తద్వారా తన క్రేజ్‌ను, మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోన్నాడు.

లైగర్‌తో కోలుకోలేని దెబ్బలు
గత ఏడాది విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే మూవీ చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీకి ఆరంభంలోనే అన్ని భాషల్లోనూ నెగెటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. ఫలితంగా ఈ చిత్రం కొన్ని కోట్ల నష్టాలను ఎదుర్కొని.. టాలీవుడ్‌లోని బిగ్ డిజాస్టర్ మూవీల లిస్ట్‌లో చేరింది.

ఖుషి అంటూ వస్తున్నాడుగా
ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' అనే సినిమాను చేస్తున్నాడు. సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా చేస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పున: ప్రారంభం అయింది. దీన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.

మరో సినిమానూ ప్రకటించి
విజయ్ దేవరకొండ తన 12వ సినిమాను 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో పోలీస్ యూనిఫామ్‌లో ఓ వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి ఉండటం ఆసక్తిని రేకెత్తించింది. ఇక, ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.

విజయ్‌పై క్రిటిక్ సంచలనం
చాలా తక్కువ సినిమాలే చేసినా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ.. 'లైగర్' మూవీతో హిట్ కొట్టకున్నా బాలీవుడ్‌లోనూ ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ సినీ విమర్శకుడు ఉమైర్ సంధు చేసిన ట్వీట్ దుమారాన్ని రేపుతోంది. అందులో విజయ్‌తో ఓ ప్రొడ్యూసర్ ఎఫైర్ పెట్టుకోడానికి ప్రయత్నించాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

పడుకోవాలని ప్రయత్నాలు
బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు తాజాగా చేసిన ట్వీట్‌లో 'విజయ్ దేవరకొండను కవ్వించేందుకు బాలీవుడ్‌కు చెందిన ఫేమస్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన శాయశక్తులా ప్రయత్నించాడు. లైగర్ సినిమా షూట్ జరుగుతోన్న సమయంలో విజయ్‌తో పడుకోవాలని అనుకున్నాడు. కానీ, కరణ్ జోహార్ ఆఫర్‌ను ఈ తెలుగు హీరో తీవ్రంగా తిరస్కరించాడు' అంటూ రాసుకొచ్చాడు.

అందుకే ట్వీట్ చేశాడంటూ
ఫిల్మ్ క్రిటిక్, సెన్సార్ బోర్డు సభ్యుడైన ఉమైర్ సంధు ఈ మధ్య తరచూ ఇలాంటి ట్వీట్లనే చేస్తున్నాడు. ముఖ్యంగా సెలెబ్రిటీల పర్సనల్ విషయాల గురించి పోస్టులు పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ గురించి కూడా ట్వీట్ చేశాడు. అయితే, అతడు ఫేమస్ అవడం కోసమే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటాడని చాలా మంది అంటున్నారు.


Click it and Unblock the Notifications











