Acharya మూవీపై ఉమైర్ సంధు ట్వీట్: ఊహించని విషయాన్ని లీక్ చేసి సర్‌ప్రైజ్ చేసిన క్రిటిక్

సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా వరుస సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఇలా ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను ప్రకటిస్తూ యమ ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఆచార్య' అనే సినిమాను కూడా చేస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించి ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఊహించని ట్వీట్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

మెగా హీరోల కాంబోలో ‘ఆచార్య'

మెగా హీరోల కాంబోలో ‘ఆచార్య'

మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తోన్న చిత్రం 'ఆచార్య'. బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

ఇది కూడా ఆ సినిమా మాదిరిగా

ఇది కూడా ఆ సినిమా మాదిరిగా

దర్శకుడు కొరటాల శివ సినిమాలు అంటే సందేశాత్మకంగా ఉంటాయి. ఇప్పుడు 'ఆచార్య' కూడా అదే పంథాలో సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ రూపొందించారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటించారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని కంప్లీట్ చేస్తాడట.

అంచనాలకు తగ్గట్లే బిజినెస్‌తో

అంచనాలకు తగ్గట్లే బిజినెస్‌తో

మెగాస్టార్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా 'ఆచార్య' మూవీని రూపొందిస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో భారీ డీల్స్ జరిగినట్లు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో రికార్డు కూడా క్రియేట్ అయిందట.

అందుకే అప్పటి వరకూ ఆపారు

అందుకే అప్పటి వరకూ ఆపారు

'ఆచార్య' మూవీకి సంబంధించిన బ్యాలెన్స్ షూట్‌ను ఇటీవలే పూర్తి చేసుకున్నారు. దీంతో ఈ చిత్రాన్ని దసరాకో, దీపావళికో విడుదల చేస్తారని అనుకున్నారు. ఒకానొక దశలో సంక్రాంతికి కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపించింది. కానీ, దీన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హిందీలోనూ విడుదల చేస్తుండడం వల్లే లేట్ చేశారని టాక్.

ఆచార్యపై ఉమైర్ సంధు ట్వీట్

ఆచార్యపై ఉమైర్ సంధు ట్వీట్

వివాదాస్పద ట్వీట్లతో దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకున్న సినీ విమర్శకుడు ఉమైర్ సంధు.. ఈ మధ్య తెలుగు చిత్రాలపై కూడా ఎక్కువగా స్పందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న 'ఆచార్య' మూవీ గురించి ట్వీట్ చేశాడు. ఇందులో ఊహించని ఓ విషయాన్ని లీక్ చేసి యూనిట్‌తో పాటు అందరికీ బిగ్ షాకిచ్చాడు.

లీక్ చేసి సర్‌ప్రైజ్ చేసిన క్రిటిక్

లీక్ చేసి సర్‌ప్రైజ్ చేసిన క్రిటిక్

తాజాగా ఉమైర్ సంధు తన ట్విట్టర్ ఖాతాలో 'ఆచార్య సినిమాకు ట్రైలర్‌కు సంబంధించిన ఫైనల్ కట్‌ను ఈరోజే ప్రొడ్యూసర్స్ ఆఫీస్‌లో పూర్తి చేశారు. చిరంజీవి, రామ్ చరణ్ మాస్ మసాలా సినిమాతో రాబోతున్నారు' అని పేర్కొన్నాడు. దీంతో ఈ మూవీ ట్రైలర్ త్వరలోనే రాబోతుందన్న విషయాన్ని పరోక్షంగా లీక్ చేశాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X