For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  అజ్ఞాతవాసి రివ్యూ.. పవన్ అదరగొట్టాడు.. అద్భుతంగా అంటూ ఉమేర్ సంధూ ట్వీట్

  By Rajababu
  |

  పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాటలు, టీజర్లు, ట్రైలర్లు, పవన్ కల్యాణ్ పాడిన పాట ప్రభావంతో ఈ చిత్రం ఇప్పటికే కమర్షియల్‌గా భారీ హిట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే అజ్ఞాతవాసి ఏ రేంజ్ హిట్ అనేది రిలీజ్ తర్వాతే తెలుస్తుందని మాట బలంగా వినిపిస్తున్నది. అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి ప్రముఖ సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ తన రివ్యూను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.

  రిపోర్టులు అద్భుతంగా

  రిపోర్టులు అద్భుతంగా

  బ్రేకింగ్ న్యూస్.. అజ్ఞాతవాసి మొదటి కాపీ బయటకు వచ్చేసింది. రిపోర్టులు అద్భుతంగా ఉన్నాయి. విశ్వసనీయమైన సమాచారం ప్రకారం పవన్ అదరగొట్టేశాడు.

  పవన్..మాస్ సాంగ్ క్రేజ్ మామూలుగా లేదు..!

  పవన్ కల్యాణ్ అదరగొట్టేశాడు..

  అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కల్యాణ్ తన యాక్టింగ్‌తో అందర్ని కట్టిపడేశాడు. ఈ చిత్రం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ఇప్పటికే చూసిన వాళ్లు చెబుతున్నారు. ఎప్పుడెప్పుడూ చూడాలా అని నేను ఎదురుచూస్తున్నాను అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

  అమెరికాలో ఒకరోజు ముందుగానే

  అమెరికాలో ఒకరోజు ముందుగానే

  కాగా అజ్ఞాతవాసి చిత్రం ఓవర్సీస్‌లో ఒకరోజు ముందుగానే అంటే జనవరి 9వ తేదీనే రిలీజ్ అవుతున్నది. దీంతో ఓవర్సీస్‌లో భారీ అంచనాలు పెరిగాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో పవన్ కల్యాణ్ చిత్రం కలెక్షన్ల దుమారం సృష్టించే అవకాశం ఉంది.

  ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం

  ఒక టికెట్ కొంటే మరొకటి ఉచితం

  అమెరికాలో ఏటీ అండ్ టీ సంస్థ అభిమానులను ఊరించేందుకు ఓ ఆఫర్ పెట్టింది. మంగళవారం చూసే సినిమాలకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అంటూ ప్రకటన చేసింది. టికెట్లను ముందే రిజర్వు చేసుకోవాలని సూచించింది. ఈ చిత్రాన్ని అమెరికాలో ఎల్‌ఏ తెలుగు రిలీజ్ చేస్తున్నది.

  రికార్డుస్థాయిలో రిలీజ్

  రికార్డుస్థాయిలో రిలీజ్

  అమెరికాలో అజ్ఞాతవాసి చిత్రం రికార్డు స్థాయిలో రిలీజ్ అవుతున్నది. బాహుబలి2 స్క్రీన్ల సంఖ్యను ఈ చిత్రం అధిగమించనున్నది. దాదాపు ఈ చిత్రం 209 ప్రదేశాల్లో రిలీజ్ కానున్నది. అమెరికాలో ఓ భారతీయ చిత్రం ఈ రేంజ్‌లో విడుదలయ్యే ఘనత అజ్ఞాతవాసి చిత్రానికి దక్కనుండటం గమనార్హం.

  సెన్సార్ క్లీన్ రిపోర్ట్

  సెన్సార్ క్లీన్ రిపోర్ట్

  అజ్ఞాతవాసి చిత్రం సెన్సార్ పనులను గత సోమవారమే ముగించుకొన్నది. ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు అధికారులు జారీ చేశారు. ఈ చిత్రంపై సెన్సార్ అధికారులు పాజిటివ్‌గా స్పందించినట్టు సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్

  యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్

  యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్టులో పవన్ కల్యాణ్ పాడిన పాట నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సుమారు మూడు రోజుల్లో 6,413,995 వ్యూస్‌కి పైగా వచ్చాయి. అలాగే 305,880 మంది లైక్ చేయగా, 21,019 మంది డిస్‌లైక్స్ వచ్చాయి

  తొలి వారంలోనే 100 కోట్లు

  తొలి వారంలోనే 100 కోట్లు

  ఇక అజ్ఞాతవాసి తొలివారమే 100 కోట్లలో చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనాలు వేస్తున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్ 200 కోట్ల సరికొత్త రికార్డును అందుకొంటుందనే మాట వినిపిస్తున్నది.

  జనవరి 10న తెలుగు రాష్ట్రాల్లో

  జనవరి 10న తెలుగు రాష్ట్రాల్లో

  హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ చిత్రం ఓవర్సీస్‌లో జనవరి 9న, తెలుగు రాష్ట్రాల్లో 10న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

  English summary
  Power Star Pawan Kalyan’s Agnyaathavaasi has got its censor formalities completed and the movie has been received ‘UA’ certificate from the censor board. The film is directed by Trivikram Srinivas & Produced by S. Radha Krishna(chinababu) under Haarika & Hassine Creations banner. Grand release on 10th January (US Premieres 9th Jan)
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more