సాహో ఫస్ట్ రివ్యూ వచ్చేసింది: గత రికార్డులు బద్దలయ్యేలా షూర్ షాట్ బ్లాక్‌బస్టర్

Recommended Video

Saaho First Review Is Out | Umair Sandhu Tweets On Saaho | Prabhas | Sujeeth | Shraddha Kapoor

బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్నసినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా యూవీ క్రియేషన్స్ వారు ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాగా సాహును ఫ్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇలాంటి భారీ సినిమాకు కేవలం ఒకే సినిమా అనుభవమున్న సుజీత్ దర్శకత్వం వహించడంతో కొందరిలో సందేహాలు ఉన్నాయి. ఈ తరుణంలో సెన్సార్ కాపీ చూసిన ఉమైర్ సంధూ సాహో సినిమా ఎలా ఉందనే విషయాన్ని తెలుపుతూ వరుస ట్వీట్ చేశాడు. ఆ వివరాలు చూస్తే..

మైండ్ బ్లోయింగ్ ఫస్టాఫ్

సాహో ఫస్టాఫ్ ప్రేక్షకులకు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మొదటి సగం మైండ్ బ్లోయింగ్ అని పేర్కొన్న ఉమేర్ సంధూ.. ప్రభాస్ ఎంట్రీయే జస్ట్ పైసా వసూల్ అని ట్వీట్ చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో ఒళ్ళు గగ్గుర్లు పొడిచే యాక్షన్ సన్నివేశాలు, ఛేజ్‌లు ఆడియన్స్ మతిపోగొడతాయని అన్నాడు.

ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం

ప్రభాస్ నటన అద్భుతంగా ఉందని, ఈ సినిమాలో ఆయన యాంటగానిస్ట్‌గా నటించారని, ఇలాంటి పాత్రలో ప్రభాస్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని మరో ట్వీట్ లో పేర్కొన్నాడు.

సాలిడ్ ఎంటర్‌టైనర్.. షూర్ షార్ బ్లాక్‌బస్టర్

మొత్తంగా చేస్తే 'సాహో' సినిమా ఓ సాలిడ్ ఎంటర్‌టైనర్. యాటిట్యూడ్, స్టార్ పవర్ కలిపి అభిమానులకు రెట్టింపు వినోదం పంచడం ఖాయం. హీరో ప్రభాస్ మరోసారి అద్భుతం సృష్టించాడు. సాహో గత రికార్డులను తుడిచి పెట్టేస్తూ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. 'షూర్ షార్ బ్లాక్‌బస్టర్' అని పేర్కొన్నాడు ఉమైర్ సంధూ.

 సాహో మూవీ

సాహో మూవీ

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై 350 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది 'సాహో' సినిమా. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో ప్రభాస్, శ్రద్ధ కపూర్ జంటగా నటించారు. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం పాలు పంచుకున్నారు. ఆగస్టు 30న ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X