లక్కంటే జెనీలియాదే.... 'బొమ్మరిల్లు' సినిమా ఏ ముహుర్తాన్న ఒప్పుకుందో గాని దశ తిరిగి పోయింది. అందులో హాసిని పాత్ర అదిరిపోయింది. యూత్ కి బాగా పట్టేసింది. ఆమె పాత్రకు చెప్పిన డైలాగు రింగ్ టోన్ గా మారుమ్రోగి పోయింది. దాంతో ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసారు. హీరో గా ఎప్పటిలాగే రీమేక్ సినిమాలలో కనిపించే జయం రవిని తీసుకున్నారు. కాని జెనీలియా పాత్రకి మాత్రం ఎంత మందిని చూసినా ఆమె రేంజి ఫెర్ ఫార్మ్ మెన్స్ ఇవ్వగల ఆర్టిస్టు కనపడలేదు. దాంతో ఆమెకు అక్కడ ఐరన్ లెగ్ అని ముద్దు పేరు ఉన్నా వేరే ఆల్టర్ నేటివ్ కనపడక ఆమెనే తీసుకున్నారు. అదృష్టం బాగుండో సినిమా నచ్చో సంతోష సుబ్రమణ్యం సూపర్ హిట్టైంది. దాంతో హిందీలో ఈ చిత్రం తీయటానికి ప్రియదర్శన్ ముందుకొచ్చారు. ఆయన హీరోగా అమీర్ ఖాన్ మేనల్లుడు హర్మాన్ ని తీసుకున్నారు. కాని హీరోయిన్ పాత్రకి మళ్ళీ సమస్య ఎదురైంది. ఈసారి కూడా జెనీలియా పాత్రకు వేరే వాళ్ళను ఆయన ఊహించలేక పోతున్నాడు. దాంతో మళ్ళీ అక్కడా హాసిని గెలిచింది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రారంభమవుతుందిట. ఏదైమైనా జెనీలియా నువ్వు లక్కీ కదా.. అంటే నా కెరీర్ హిందీ సినిమా తుజే మేరి కసమ్ (నువ్వే కావాలి హిందీ రీమేక్) తోనే ప్రారంభమైంది అంటోంది.