»   » శ్రీదేవి డెత్ కేసు ముగిసినా... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏవి?

శ్రీదేవి డెత్ కేసు ముగిసినా... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏవి?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi Case Closed But Many Unanswered Questions Here ?

శ్రీదేవి అనుమానాస్పద మరణంపై దుబాయ్ పోలీసుల విచారణ ముగిసింది. అనంతరం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ కేసులో విచారణ ముగిసిందని దుబాయ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ వెల్లడించింది. ఫోరెన్సిక్‌ నివేదిక ప్రకారం ఆమె సృహకోల్పోవడంతో బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయిందని, కేసును క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీదేవి మృతదేహం పాడుకాకుండా ఉండేందుకు ఎంబామింగ్ పూర్తి చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే శ్రీదేవి మరణంపై సమాధానం లేని ప్రశ్నలు అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

శ్రీదేవి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు ఎందుకు?

శ్రీదేవి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు ఎందుకు?

ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో శ్రీదేవి బాత్ టబ్ లో పడిపోవడం వల్ల మరణించింది అని ఉంది. బాత్ టబ్‌లో పడిపోయినపుడు బలమైన గాయం అయితే తప్ప మరణించే అవకాశం లేదు. అయితే ఆమె శరీరం మీద చిన్న స్క్రాచ్ కూడా లేక పోవడంతో అభిమానుల్లో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 బోనీ కపూర్ సర్ ప్రైజ్‌విజిట్

బోనీ కపూర్ సర్ ప్రైజ్‌విజిట్

మోహిత్ మార్వా వెడ్డింగ్ తర్వాత శ్రీదేవి భర్త బోనీ కపూర్ ముంబై వచ్చారు. శ్రీదేవి తన చిన్న కూతురు ఖుషితో కలిసి దుబాయ్ లోనే ఉన్నారు. ఆల్రెడీ శ్రీదేవి ఇండియాకు తిరిగి వద్దామని రెడీ అవుతుండగా బోనీ కపూర్ సర్‌ప్రైజ్ చేయడానికి మళ్లీ దుబాయ్ ఎందుకు వెళ్లినట్లు? అనే ప్రశ్నకు సమాధానం లేదు.

శ్రీదేవి శరీరంలోకి ఆల్కహాల్ ఎలా వచ్చింది?

శ్రీదేవి శరీరంలోకి ఆల్కహాల్ ఎలా వచ్చింది?

శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో ఉంది. అయితే ఆమెకు మధ్యం అలవాటు లేదని, అప్పుడప్పుడు వైన్ మాత్రం తాగుతుందని సన్నిహితులు అంటున్నారు. మరి ఆమె బాడీలోకి ఆల్కహాల్ ఎలా వచ్చింది? అనే దానికి సమాధానం లేదు.

బలవంతంగా తాగించారా?

బలవంతంగా తాగించారా?

శ్రీదేవికి అత్యంత సన్నిహితుడు అమర్ సింగ్... శ్రీదేవి హార్డ్ డ్రింక్ సేవించరని, ఆమె వైన్ లాంటి లైట్ డ్రింక్ మాత్రమే సేవిస్తారని అంటున్నారు. దీంతో ఆ రోజు రాత్రి శ్రీదేవికి ఎవరైనా బలవంతంగా మద్యం తాగించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బాత్ టబ్ నీటితో ఎందుకు నిండి ఉంది?

బాత్ టబ్ నీటితో ఎందుకు నిండి ఉంది?

పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బాత్రూంలోని బాత్ టబ్ ఆల్రెడీ నీటితో నిండి ఉంది అని ఉంది. సాధారణంగా అయితే స్నానం చేయడానికి ముందు టబ్ నింపుకుంటారు. శ్రీదేవి బాత్రూం వెళ్లింది స్నానం చేయడానికి అయితే కాదు. ఆమె బాతింగ్ క్లాత్స్ కూడా ధరించలేదు. కేవలం ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్లారు. మరి బాత్ టబ్ ముందే నీటితో ఎందుకు నిండి ఉంది అనే ప్రశ్నకు సమాధానం లేదు.

బోనీ డాక్టర్‌కు ఎందుకు ఫోన్ చేయలేదు?

బోనీ డాక్టర్‌కు ఎందుకు ఫోన్ చేయలేదు?

బాత్రూంలో శ్రీదేవి పడిపోయి ఉండటాన్ని తొలుత చూసింది బోనీ కపూర్ కపూర్ అని అంటున్నారు. మరి బోనీ వెంటనే హోటల్లో ఉండే ఎమర్జెన్సీ డాక్టర్‌కు ఫోన్ చేయకుండా తన స్నేహితుడికి ఎందుకు ఫోన్ చేశారు? అనే ప్రశ్నకు సమాధానం లేదు.

ఆ విషయం అసాధారణంగా ఉంది?

ఆ విషయం అసాధారణంగా ఉంది?

కేవలం బాత్ టబ్‌లో పడి చనిపోవడం అనేది అసాధారణంగా ఉంది. ఒక వేళ ఆ సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చినా విక్టిమ్ బాత్ టబ్ నుండి బయటకు రావొచ్చు. కానీ శ్రీదేవి విషయంలో ఇది అసాధారణంగా, సమాధానం లేని ప్రశ్నగా ఉంది.

 భర్త ఇండియా వెళ్లినా...శ్రీదేవి దుబాయ్‌లో ఎందుకున్నారు?

భర్త ఇండియా వెళ్లినా...శ్రీదేవి దుబాయ్‌లో ఎందుకున్నారు?

పెళ్లి వేడుక ముగిసిన అనంతరం భర్త బోనీ కపూర్ ఇండియా వెళ్లి పోయారు. ఆల్రెడీ వేడుక ముగిసినా, భర్త ఇండియా వెళ్లి పోయినా శ్రీదేవి దుబాయ్ హోటల్ లోనే ఎందుకు ఉండిపోయారు? అనే ప్రశ్నకు సమాధానం లేదు.

 మరణ వార్త ఎందుకు ఆలస్యంగా?

మరణ వార్త ఎందుకు ఆలస్యంగా?

పోస్టుమార్టమ్ రిపోర్టు ప్రకారం శ్రీదేవి 9 గంటలకు చనిపోయినట్లు ఉంది. అయితే ఆమె మరణ వార్త మిడ్ నైట్ తర్వాత గానీ బయటకు రాలేదు. ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది? అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.

బోనీ కపూర్ నోరు విప్పితే తప్ప

బోనీ కపూర్ నోరు విప్పితే తప్ప

దుబాయ్‌లో ఏం జరిగిందనే విషయమై బోనీ కపూర్ లేదా శ్రీదేవి బంధువులు ఎవరైనా నోరు విప్పితే తప్ప అభిమానుల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి అయ్యేలా కనిపించడం లేదు. ఇండియా వచ్చి తర్వాత శ్రీదేవి కుటుంబ సభ్యులు దీనిపై స్పందిస్తారని, అనుమానాలు నివృత్తి చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

English summary
Unanswered questions on Sridfevi death. Talking about the cause of Sridevi's death, many on social media have been saying that she did not die due to accidental drowning.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu