»   » శ్రీదేవి జీవితాంతం కష్టాలే, బోనీ ఆమె ఆస్తులు అమ్మేశాడు, బాధపడింది: శ్రీదేవి బాబాయ్ సంచలనం!

శ్రీదేవి జీవితాంతం కష్టాలే, బోనీ ఆమె ఆస్తులు అమ్మేశాడు, బాధపడింది: శ్రీదేవి బాబాయ్ సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi's Life Truths : బోనీ కపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడిందట ?

శ్రీదేవి మద్రాసులో పుట్టి పెరిగినా ఆమె కుటుంబ మూలాలు తిరుపతిలోనే ఉన్నాయి. తిరుపతిలో ఆమెకు చాలా మంది బంధువులు ఉన్నారు. శ్రీదేవి మరణం నేపథ్యంలో ఆమె బాబాయ్ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.

అలా సినీ ఫీల్డులోకి

అలా సినీ ఫీల్డులోకి

రంగారావు అనే వ్యక్తి పరిచయంతో శ్రీదేవిని సినీ ఫీల్డులోకి పంపారని, బాల నటిగా శ్రీదేవి ఎంతో అద్భుతమైన ప్రదర్శన చూసి దర్శక నిర్మాతలు ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చారని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

శ్రీదేవి బడికి, కాలేజీకి వెళ్లలేదు

శ్రీదేవి బడికి, కాలేజీకి వెళ్లలేదు

చిన్న తనం నుండి నటిస్తూ ఉండటం వల్ల శ్రీదేవి బడికి, కాలేజీకి వెళ్లి చదువుకోలేదు. మద్రాసులో ఒక టీచర్ ఇంటికి వచ్చి ఆమెకు చదువు చెప్పేవారు. హైస్కూలు, కాలేజీ మొహం శ్రీదేవి అసలు ఎరుగదు అని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.

సర్జరీలు చేయించుకుంది

సర్జరీలు చేయించుకుంది

శ్రీదేవి ముఖానికి కొన్ని సర్జరీలు చేయించుకున్న మాట నిజమే అని.... ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు వేణు గోపాల్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

బోనీతో పెళ్లి తల్లికి ఇష్టం లేదు

బోనీతో పెళ్లి తల్లికి ఇష్టం లేదు

బోనీ కపూర్‌తో వివాహం శ్రీదేవి తల్లికి అసలు ఇష్టం లేదు. కానీ వారిద్దరూ ఆల్రెడీ కమిట్ అయ్యారు. అంతకు ముందు రెండు మూడు సార్లు బోనీ ఇంటికి వస్తే ఆమె కసిరి పంపివేసింది. శ్రీదేవి తల్లి మెదడు తప్పుడు ఆపరేషన్ వల్ల మతిస్థిమితం కోల్పోయింది, ఆమె సరిగా ఉంటు బోనీతో శ్రీదేవి పెళ్లి జరిగేది కాదేమో... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

అప్పుడే బాగా కనెక్ట్ అయ్యారు

అప్పుడే బాగా కనెక్ట్ అయ్యారు

బోనీ కపూర్ బేనర్లో శ్రీదేవి సినిమా చేసే సమయంలో వారి మధ్య పరిచయం బలపడింది. శ్రీదేవి తల్లి అమెరికా ఆసుపత్రిలో ఉన్న సమయంలో బోనీ కపూర్ చేదోడు వాదోడుగా ఉన్నాడు. అప్పుడు వారి మధ్య కనెక్షన్ బాగా కుదిరింది.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

అప్పులు మాట నిజమే

అప్పులు మాట నిజమే

శ్రీదేవి అప్పుల మాట నిజమే. వాటి వల్ల మానసిక సంఘర్షణ పడేది. అవి ఆమె చేసిన అప్పులు కాదు. బోనీ కపూర్ సినిమాలు చేసి నష్టపోయాడు. ఆ డబ్బును శ్రీదేవి ఆస్తులు అమ్మి కవర్ చేశారు.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

కష్టంతోనే బ్రతికింది, కష్టంతోనే పోయింది.. మనశ్శాంతి లేదు.

కష్టంతోనే బ్రతికింది, కష్టంతోనే పోయింది.. మనశ్శాంతి లేదు.

శ్రీదేవి మనసులో అప్పులకు సంబంధించి బాధ ఉండేది. అప్పులు తీర్చడానికి చెన్నైలో కూడా శ్రీదేవికి చెందిన చాలా ఇళ్లులు అమ్మారు. జీవితాంతం కష్టంతోనే బ్రతికింది, కష్టంతోనే పోయింది. ఆమెకు ఎప్పుడూ మనశ్శాంతి అనేది లేదు..... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

నవ్వు నటిస్తుంది

నవ్వు నటిస్తుంది

ప్రేక్షకులు, ప్రపంచానికి తన బాధ తెలియకూడదని ఆమె ముఖంలో ఎప్పుడూ నవ్వు ఉంటుందే తప్ప... అది నిజమైన నవ్వు కాదు.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

బోనీని పెళ్లి చేసుకుని ఉండకూడదు, మొదటి భార్యతో చాలా గొడవలు

బోనీని పెళ్లి చేసుకుని ఉండకూడదు, మొదటి భార్యతో చాలా గొడవలు

బోనీ కపూర్ ఇంట్లో ఓప్పుడూ ఏదో ఒక సమస్య. అటు అప్పులు. ఇటు కుటుంబ గొడవలు. దీంతో దేవి తన కూతుళ్ల భవిష్యత్తు గురించి చాలా బాధపడేది. మా వాళ్లు వెళ్లినపుడు ఈ విషయం చెప్పేది. బోనీ కపూర్‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని చాలా బాధ పడింది. బోనీ మొదటి భార్యతో చాలా గొడవలు అయ్యాయి కూడా అని.... వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

బోనీ కపూర్ మీద అనుమానం లేదు, పిరికిది కాదు

బోనీ కపూర్ మీద అనుమానం లేదు, పిరికిది కాదు

శ్రీదేవి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. పుట్టిన సమయం నుండి కష్టాల్లోనే ఉంది. వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగింది. సినిమాలు తగ్గించిన తర్వాత పిల్లల పెంపకం మీద పడింది. వారే సర్వస్వంగా బ్రతికింది. బోనీ కపూర్ మీద అనుమానం లేదు. మాకు తెలిసినంత వరకు శ్రీదేవిని బాగా చూసుకున్నారు.... అని వేణు గోపాల్ రెడ్డి తెలిపారు.

English summary
Uncle Venugopal Reddy about Sridevi's death. Until now, family members of actress Sridevi, who died allegedly due to 'accidental drowning' in a bathtub, have not responded in any way to the tragic news. They are mum over the cause and nature of the death.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu