వెల్లడి ‌:హీరో,డైరక్టర్ లని లేపేయ్యాలనే మాఫియా స్కెచ్

By Srikanya

హైదరాబాద్‌: ఇటీవల ముంబయిలో అరెస్టయిన ఓ గ్యాంగ్‌లోని ఏడుగురు వ్యక్తులు బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ఖాన్‌, దర్శకురాలు ఫరాఖాన్‌, దర్శక నిర్మాత మహేష్‌ భట్‌లు లక్ష్యంగా ప్రణాళిక వేసుకున్నట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. వీళ్లు విదేశాల్లో తలదాచుకుంటున్న అండర్‌వరల్డ్‌ డాన్‌ రవి పుజారి గ్యాంగ్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.

ముంబయిలోని నిర్మాత కరీమ్‌ మోరానీ ఇంటి వద్ద ఆగస్టులో కాల్పులు జరిపిన కేసులో పోలీసులు ఈ ఏడుగురిని అరెస్టు చేశారు. గత రెండు నెలలుగా వీరు ఫరాఖాన్‌, షారుఖ్‌, మహేష్‌భట్‌లపై నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

ముంబై అండర్ వరల్డ్ మాఫియా మళ్లీ రెచ్చి పోతోంది. సినీ తారలను టార్గెట్ చేస్తూ వారిని భయ భ్రాంతులకు గురి చేస్తోంది. బాలీవుడ్ మూవీ ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో నటించిన షారుక్ ఖాన్, బోమన్ ఇరానీలకు ఇటీవల మాఫియా డాన్ రవి పుజారి గ్యాంగ్ నుండి ఆ మధ్య.న బెదిరింపు కాల్స్ వచ్చాయి. నటుడు సోను సూద్‌ను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు సైతం పాల్పడ్డారు.

Underworld Don Ravi Pujari was Targeting Shah Rukh

రవి పుజారి గ్యాంగ్ ‘హ్యాపీ న్యూ ఇయర్' చిత్రంలో నటిస్తున్న వారినే టార్గెట్ చేయడం వెనక ఓ బలమైన కారణం వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కరిమ్ మోరానీతో ఓ విషయంలో రవి పుజారి విబేధించారని సమాచారం. ఈ క్రమంలోనే నిర్మాత ఇంటిపై ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపటం జరిగింది.

ఒకప్పుడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహం ముంబైలో ఇలాంటి చర్యలకు పాల్పడి....పలు దారుణాలకు పాల్పడ్డాడు. చాలా కాలం తర్వాత మళ్లీ ముంబైలో మాఫియా ఆగడాలు వెలుగులోకి రావడం, బెదిరింపులకు పాల్పడటం సినీ రంగానికి చెందిన వారిని భయం గుప్పిట్లోకి నెట్టి వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X