ఊహించని పోన్ కాల్ అంటూ ఉద్వేగంగా రాజమౌళి
రాజమౌళి తాజా చిత్రం ఈగ సూపర్ హిట్ టాక్ రావటంతో ఎక్కడెక్కడనుంచో ఆయన్ను అభినందిస్తూ కాల్స్,ట్వీట్స్ వస్తున్నాయి. తాజాగా ఆయన ట్వీట్ చేస్తూ... అన్ ఎక్సపెక్టెడ్ కాల్.. జయ ప్రకాష్ నారాయణ గారి నుంచి వచ్చింది.. నన్ను ఆయన కంగ్రాట్స్ చేసారు అంటూ ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే రజనీకాంత్, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్స్, స్టార్ డైరక్టర్స్ శంకర్ వంటి వారు కూడా ఈ చిత్రం గురించి ఓ రేంజిలో మెచ్చుకుంటూ అబినందనలు తెలియచేసారు.
ఈగ తెలుగులోనే కాక, తమిళ, మళయాళ భాషల్లో కూడా ఈ చిత్రం సంచలన విజయం నమోదు చేసింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం 3D వెర్షన్ పై అందరి దృష్టీ వెళ్ళుతోంది. హిందీలో ఈ చిత్రం డబ్ చేసి, త్రీడి ఫార్మెట్ లోకి మార్చి రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం త్రీడి కన్వర్షన్ వర్క్ జరుగుతోంది. ఇక నార్త్, మహా రాష్ట్రలలో ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు రాజమౌళి చెప్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఓ సినిమాని 3D లోకి మార్చి రిలీజ్ చేయటం అంటే కష్టం. ఎందుకంటే 3D లోకి ఓ చిత్రాన్ని మార్చాలంటే చాలా టైమ్ తీసుకుంటుందనేది నిపుణులు చెప్తున్న మాట.
రాజమౌళి ఈ చిత్రం సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. విజయ యాత్రల్లో ఉన్న ఆయన మాట్లాడుతూ.. చిత్ర నిర్మాతలు సురేష్ బాబు, సాయి కొర్రపాటి ఇద్దరూ కూడా ఈ సీక్వెల్ విషయమై చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడే తీస్తారా లేక ప్రభాస్ చిత్రం అనంతరం తీస్తారా అన్నది చెప్పలేదు. ప్రస్తుతం రాజమౌళి ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మొన్న సక్సెస్ టూర్ ని ప్రారంభించారు. మొదటిగా తెలంగాణా జిల్లాలు ఆ తర్వాత ఆంధ్రా కోస్తా జిల్లాలు కవర్ చేస్తున్నారు. ఈ టూర్ రెండు రోజులు పాటు సాగుతుందని చెప్తున్నారు. ఇక ఈగ సక్సెస్ ని నిర్మాత సురేష్ బాబు,దర్శకుడు రాజమౌళి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సురేష్ బాబు తాను బాగా ప్రౌడ్ ఫీలవుతున్నారని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











