2020లో మొదలు కావాల్సిన ఆ సినిమా.. మరో రెండేళ్ల వరకు లేనట్లే..
2020లో సినీ ప్రపంచంలో ఎన్నో ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు థియేటర్స్ మూత పడటం మరోవైపు సినిమా షూటింగ్స్ వాయిదా పడటం.. ఇక అంతకు మించి కరోనా కష్ట కాలంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే బిగ్ బడ్జెట్ సినిమాలు పరిస్థితి కూడా చాలా ప్రమాదకరంగా మారింది. థియేటర్స్ ఎప్పటిలానే నడిస్తే కొంచెం ధైర్యంగా షూటింగ్స్ చేసుకోవచ్చని సినిమా వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కానీ థియేటర్స్ కొన్ని చోట్ల తేరచుకున్నప్పటికీ జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక ఈ ఏడాది సెట్స్ పైకి రావాల్సిన సినిమాల్లో ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు ఏకంగా మరో రెండేళ్ల పాటు వాయిదా పాడింది. ఆ సినిమా మరేదో కాదు. రానా దగ్గుబాటి హిరణ్యకశిప. ఆ సినిమా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్న డైరెక్టర్ గుణశేఖర్ నిర్మాత సురేష్ దగ్గుబాటితో రెగ్యులర్ గా చర్చలు కూడా జరిపారు. ఈ ఏడాది స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాను ప్రజెంట్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా రాకతో ఒక్కసారిగా ప్లాన్స్ మొత్తం చేంజ్ అయ్యాయి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కించాల్సిన ప్రాజెక్ట్ కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో రిస్క్ చేయడం ఇష్టం లేక మరో ఏడాది వరకు సినిమా ఉసే ఎత్తకూడదని డిసైడ్ అయ్యారు. ఇక సినిమాను ఒక వేళ స్టార్ట్ చేయాలి అంటే ప్రీ ప్రొడక్షన్ పనులు కోసమే చాలా సమయం పడుతుంది. వర్క్ షాప్ అయితే తప్పనిసరి కాబట్టి ఇంచుమించు రెండేళ్ల వరకు హిరణ్యకశిప రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకపోవచ్చని సమాచారం. ఇక ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం అనే ఒక హిస్టారికల్ లవ్ స్టొరీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











