యునిసెఫ్ భారత రాయబారిగా స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా యునిసెఫ్ భారత రాయబారిగా నియమితులవనున్నారు. యునిసెఫ్ కార్యక్రమాలు, చిన్నారులు, యువత హక్కులకు మద్దతుగా ఆమె ప్రచారం చేస్తారు. వివిధ రంగాల్లో అత్యున్నత శిఖరాలకు చేరిన ప్రముఖులు యునిసెఫ్ రాయబారులుగా..చిన్నారుల హక్కుల సాధనకు కృషి చేస్తారు. యునిసెఫ్ కార్యక్రమాలకు నిధులను సేకరిస్తారు. పదో తేదీన జరిగే ఓ కార్యక్రమంలో ఈ మేరకు ప్రియాంక ఎంవోయూపై సంతకం చేస్తారని యునిసెఫ్ వర్గాలు శనివారం వెల్లడించాయి.ప్రస్తుతం ప్రియాంక డాన్ 2, కిస్మత్ టాకీస్, రేస్ 2, సాత్ ఖన్ మాఫ్, అంజన అంజానీ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే ఆమె కలర్స్ టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న 'ఫియర్ ఫ్యాక్టర్ ఖత్రాన్ కే లాడీ' రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది.
More from Filmibeat
ప్రియాంక చోప్రా యునిసెఫ్ భారత రాయబారి రాయబారి priyanka chopra don 2 saat khoon maaf race2 kismat talkies


Click it and Unblock the Notifications











