లైవ్ ఇంటర్వెల్ తో ‘వెన్నెల 1 1/2’
దేవ కట్టా దర్శకత్వంలో వచ్చిన 'వెన్నెల' చిత్రానికి కొనసాగింపుగా నటుడు 'వెన్నెల' కిషోర్ రూపొందిస్తున్న చిత్రం 'వెన్నెల వన్ అండ్ హాఫ్'. చైతన్యకృష్ణ, మోనాల్ గజ్జర్ జంటగా నటిస్తున్నారు. వాసు, వర్మ నిర్మాతలు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -''ప్రేక్షకుల ఊహకందని ఆశ్చర్యాలు ఎన్నో ఈ సినిమాలో ఉంటాయి. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. ఈ నెల 21న సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు.
ఈ చిత్రం కథ బ్యాంకాక్ లో జరుగుతుంది. స్టోరీలైన్ చూస్తే...విజయవాడలోనో, హైదరాబాద్‌లోనో చదివితే ఏం వస్తుంది? మహా అయితే మంచి ఉద్యోగం వస్తుంది. అదే... విదేశాలకెత్తే వూర్లో మంచి క్రేజ్ వస్తుంది. పైగా అక్కడి అమ్మాయిల్ని పటాయించొచ్చు. వారాంతాల్లో కావల్సినంత హంగామా చేయొచ్చు. ఆ అబ్బాయి కూడా అలాగే అనుకొన్నాడు. వెంటనే విమానం ఎక్కేశాడు. మరి అమ్మాయిల మనసులో స్థానం సంపాదించాడా? లేదా? ఈ విషయాలు తెలియాలంటే 'వెన్నెల వన్ అండ్ హాఫ్' చూడాల్సిందే. చైతన్యకృష్ణ, మోనాల్ గజ్జర్ జంటగా నటించారు.
చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత వర్మ మాట్లాడుతూ -''సినిమా ఆరంభం నుంచి చివరి వరకు వినోదంగా సాగుతుంది. వంద శాతం ప్రేక్షకులను నవ్విస్తుంది. సునిల్‌కశ్యప్ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారు. జీఆర్ 8 ప్రొడక్షన్స్ ప్రై.లి. పతాకంపై వాసు, వర్మ 'వెన్నెల 1 1/2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.బ్రహ్మానందం, రఘుబాబు, మాస్టర్ భరత్, శ్రావణ్, గిరిధర్, హరీష్, వెన్నెల మధు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: సురేష్ భార్గవ్.


Click it and Unblock the Notifications












