»   » కమల్ హాసన్ ట్విట్టర్లో చేరారు, ఆయన తొలి ట్వీట్ ఇదే..

కమల్ హాసన్ ట్విట్టర్లో చేరారు, ఆయన తొలి ట్వీట్ ఇదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియాలోనే కాదు... ఇండియన్ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నటుడు కమల్ హాసన్. దశాబాద్దాలు ప్రేక్షకులను అలరిస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. జనవరి 26 సందర్భంగా కమల్ హాసన్ అభిమానులను సర్ ప్రైజ్ చేసారు. ట్విట్టర్లో జాయిన్ అయ్యారు. ఇకపై అభిమానులతో టచ్ లో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Universal star Kamal Haasan is on Twitter

ట్విట్టర్ ఖాతా తెరిచిన 14 గంటల్లోనే ఆయన్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 30వేలకు చేరింది. కమల్ హాసన్ చేసిన తొలి ట్వీట్ ఇదే...

కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే...ఆయన నటించిన ‘చీకటి రాజ్యం' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద యావరేజ్ ఫలితాలు సాధించింది. ఇక కమల్ నటించిన ‘విశ్వరూపం-2' ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుత ఆయన రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ‘అమ్మా నాన్న ఆట' అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళంలో ద్విబాషా చిత్రంగా తెరకెక్కుతోంది.

English summary
On the occasion of the country’s 67th Republic Day, Kamal Haasan surprised millions of his fans by joining the microblogging site, Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu