»   » వీడియో : కుదిపేస్తున్న ఎన్టీఆర్ సోదరుడు, సెక్సీ అమ్మాయిగా.. అబ్బాయిలు చూస్తే ఫ్లాట్ అంతే!

వీడియో : కుదిపేస్తున్న ఎన్టీఆర్ సోదరుడు, సెక్సీ అమ్మాయిగా.. అబ్బాయిలు చూస్తే ఫ్లాట్ అంతే!

Subscribe to Filmibeat Telugu
కుదిపేస్తున్న ఎన్టీఆర్ సోదరుడు, సెక్సీ అమ్మాయిగా..!!

మలయాళీ ప్రముఖ యువ నటుడు ఉన్ని ముకుందన్ సినిమా పరిజ్ఞానం ఉన్న వారికి తెలిసే ఉంటాడు. లేకుంటే ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రం గుర్తుచేసుకుంటే సరిపోతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సోదరుడిగా విలన్ పాత్రలో మెరిసింది ఈ యువ నటుడే. తాను తలుచుకుంటే పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తా అని మరో మారు ఉన్ని ముకుందన్ నిరూపించుకున్నాడు. ముకుందన్ తాజాగా నటిస్తున్న చిత్రం చాణక్య తంత్రం. ఈ చిత్రానికి సంబందించిన మేకింగ్ వీడియో సోషల్ మీడియాని కుదిపేస్తోంది. హ్యాండ్సమ్ లుక్ లో యువతుల మనసులకు గాలం వేసేలా ఉండే ముకుందన్ సెక్సీ అమ్మాయిగా మారిపోయాడు.

సౌత్ లోని అన్ని భాషల్లో

సౌత్ లోని అన్ని భాషల్లో

ఉన్ని ముకుందన్ స్వతహాగా కేరళకు చెందిన వాడే అయినప్పటికీ తమిళ చిత్రం సీదం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు దక్షణాది భాషలన్నింటిలోనూ ముకుందన్ నటిస్తున్నాడు.

ఎన్టీఆర్ కు సోదరుడిగా

ఎన్టీఆర్ కు సోదరుడిగా

తెలుగులో ఉన్ని ముకుందన్ నటించిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రంలో ముకుందన్ ఎన్టీఆర్ కు సోదరుడిగా, విలన్ గా నటించి మెప్పించాడు.

ఉన్ని నటిస్తున్న చిత్రం అదే

ఉన్ని నటిస్తున్న చిత్రం అదే

ఉన్ని ముకుందన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం చాణిక్య తంత్రం. మలయాళంలో ఈ చిత్రం రూపొందుతోంది.

కుదుపేస్తున్న మేకింగ్ వీడియో

ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ కొద్ది సేపు మహిళ పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ గెటప్ కి సంబందించిన వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

సెక్సి కరీష్మాగా

సెక్సి కరీష్మాగా

ముకుందన్ ఈ చిత్రంలో పోషించబోతున్న లేడీ గెటప్ పేరు కరిష్మా. ఉన్నిని కరిష్మాగ చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముకుందన్ అందమైన మహిళగా ఒదిగిపోయాడని అబ్బాయిలే కామెంట్ చేస్తుండడం విశేషం.

పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తాడు

పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తాడు

తక్కువ చిత్రాలతోనే ఉన్ని ముకుందన్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కరిష్మా గెటప్ కోసం ఉన్ని ముకుందన్ డెడికేషన్ అదిరింది అని ప్రశంసలు దక్కుతున్నాయి. పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తాడని చాణిక్య తంత్రం చిత్ర యూనిట్ ముకుందన్ ని ప్రశంసిస్తోంది.

English summary
Unni Mukundan's makeover as lady creates ripples in internet. Unni Mukundan dedication on this character is superb
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu