పాపం..ఆ సినిమా రిలీజ్ కు ముందే యూట్యూబ్‌లో
రిలీజైన రెండో రోజో మూడో రోజో తర్వాత ఇంటర్నెట్‌లోనూ, మా ర్కెట్‌లోనూ పైరసీ సినిమాలు కనపడతూండటం కామన్. కానీ రిలీజ్ కు ముందే ఇంటర్నెట్ లో సినిమా దర్శనమిస్తే ఏం చేయాలి..ఇప్పుడదే సమస్యతో సతమతమవుతున్నారు.. 'తేరా క్యా హోగా' చిత్ర నిర్మాతలు. తాజాగా సోహా అలీఖాన్, నీల్ నితిన్ ముఖేష్ నటించిన 'తేరా క్యా హోగా' చిత్రం విడుదల కాకుండానే 'యూట్యూబ్'లో దర్శనమిచ్చింది. ఇంకా ఎడిటిం గ్ కూడా పూర్తికాని ఈ సినిమా ఇంటర్నెట్ పెట్టడం నిరాశకు గురిచేసిందని దర్శకుడు సుధీర్ మిశ్రా అంటున్నారు.
నిజానికి ఈ చిత్రం 2007లోనే షూటింగ్ పూర్తయింది. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులతో విడుదలలో లేటు అయింది. దక్షిణాసియా చిత్రోత్సవాల్లో దీన్ని ఇటీవల ప్రదర్శించారు. మంచి ప్రశంసలు రావడంతో ఈ నెలలోనే విడుదల చేయాలని నిర్మాత టూటూ శర్మ నిర్ణయించారు. ఇంతలోనే 'తేరా...' నెట్‌లో కనిపించడంతో చిత్ర వర్గాలు నిర్ఘాంతపోయాయి. మొత్తం చిత్రాన్ని పదకొండు భాగాలుగా ఉంచారు. ఇక ఈ మధ్యే తమిళ చిత్రం 'జగ్గుభాయ్' విడుదలకు ముందే పైరసీ సీడీల రూపంలో బయటకొచ్చేసి అందరినీ భయపెట్టిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











