కంగనా రనౌత్ ఇంట్లోంచి గెంటివేయబడ్డ క్షణాలు (ఫోటోలు)
ముంబై: ఏక్ నిరంజన్ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన కంగనా రనౌత్ తన తండ్రిచే ఇంట్లోంచి గెంటివేయబడింది. అయితే ఇప్పుటి మ్యాటర్ కాదు ఇది. తన గతం గురించి ఆమె ఓ మీడియా సంస్ధతో మాట్లాడుతూ ఈ షాకింగ్ నిజాన్ని వెల్లడించింది. తన తండ్రి తనను ఇంటినుంచి వెళ్లకొట్టిన సంఘటన గుర్తు చేసుకుంది.
ఆమె చదువుని మధ్యలో ఆపుచేసి.. డిల్లీకి అవకాసాలు కోసం వెళ్లానంటే తండ్రి అడ్డుపడి, తిట్టి, గొడవ పడి ఇంట్లోంచి గెంటేసారని చెప్పుకొచ్చింది. అంతేకాక తనను చెంపపై కొట్టారని, ఆ సమయంలో తన వద్ద చిల్లిగవ్వ కూడా లేదని అంది. అయితే తను మాత్రం తన జీవితం తనకు నచ్చిన రీతిలో ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు వివరించింది.
అలాగే తన తొలి హిట్ చిత్రం గ్యాంగస్టర్ విడుదల తర్వాత కుటుంబం ఎలా స్పందించిందో వివరించింది. తన పేరు నుంచి ఇంటిపేరుని తొలిగించుకోమని తమ తాత అన్నారని, ఆ సినిమాలో కిస్ సీన్ ని వారు చాలా విభేందించారు అంది. తన కుటుంబం సపోర్టు లేకపోయినా ఆమె కెరీర్ లో బెస్ట్ గా నిలిచే చిత్రాలు ఇవ్వగలిగింది.
కంగనా కుటుంబానికి సంభందించిన ఇప్పటి వరకూ చూడని ఫోటోలు మీ కోసం..

తల్లి, తండ్లులతో కంగనా రనౌత్..

తన సోదరి రంగోలితో కంగనా.

కాలేజీ రోజుల్లో కంగనా.

సోదరి వివాహంలో.. కంగనా.

చిన్న పిల్లగా కంగనా... (అరుదైన ఫోటో).

కంగనా రనౌత్... తల్లి, తండ్రి వివాహం..

కంగనా రనౌత్ తల్లి అరుదైన ఫోటో... (లెప్ట్ లో.. తల్లి)


Click it and Unblock the Notifications











