For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ జాన్,బిపాసా ఎఫైర్ అరుదైన ఫోటోలు(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  ముంబై: దాదాపు తొమ్మిదేళ్ల సహజీవనానంతరం విడిపోయిన జంట జాన్ అబ్రహం, బిపాసా బసు. జిస్మ్ సెట్స్ మీద ప్రేమలో పడిన ఈ జంట తమ అభిరుచులకు అనుగుణమైన వారితోనే తమ తర్వాత జీవితం అనుకుని లైఫ్ ని ప్రారంభించారు. ఇక త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అని అందరూ భావిస్తున్న సమయంలో వీరిద్దరూ విడిపోయారు. బిపాసా ఇండైరక్ట్ గా జాన్ ని బ్లేమ్ చేసింది. జాన్ తనను ఛీట్ చేయటం వల్లే విడిపోవాల్సి వచ్చిందని అంది.

  జాన్ అబ్రహం తొలిసారిగా 2002 లో డేటింగ్ మొదలెట్టారు.

  జిస్మ్ సెట్స్ లో వీరిద్దరూ కలుసుకున్నారు..తొలిచూపులనే ప్రేమలో పడ్డారు.


  సినిమాల్లోకి ప్రవేశించకముందు ఇద్దరూ సక్సెస్ ఫుల్ మోడల్స్

  జాన్ ని కలుసుకునేటప్పటకి బిపాసా ఎస్టాబ్లిష్ స్టార్. జాన్ ఓ స్ట్రగులర్ అప్పటికీ..అయినా వీరి బంధానికి అది అడ్డుకాలేదు.

  జాన్ తో డేటింగ్ మొదలవ్వక ముందు బిపాసా...యాక్టర్,మోడల్ అయిన డినో మోరియా తో రిలేషన్ లో ఉండేది.

  ఈ జంట తొలి సారిగా కలిసి చేసిన జిస్మ్ భాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్టవటం వీరద్దరికి కెరీర్ పరంగానే కాక బంధానికి ఓ మలుపు

  జిస్మ్ విజయంతో వీరిద్దరూ సక్సెస్ ఫుల్ పెయిర్ గా ఇండస్ట్రీలో ముద్రపడి..కలిసి ఎన్నో సినిమాలు చేసారు. వీరి సాన్నిహిత్యం...మరింత దగ్గర చేసింది.


  జాన్ తమ రిలేషన్ గురించి చెప్తూ... ఇద్దరు హెడ్ స్ట్రాంగ్ పీపుల్ మధ్య బంధం గా అభివర్ణించాడు


  జాన్ ఓ సారి ఇలా కామెంట్ చేసాడు, "బిపాసాతో నేను ప్రేమలో పడటానికి కారణం ఆమె చాలా బలమైన వ్యక్తిత్వం కలిగి ఉండటమే. ఓ గర్ల్ ప్రెండ్ గా ఆమె చాలా కేరింగ్ ఉంటుంది. తన ఇమేజ్ కి భిన్నంగ్ చాలా హోమ్లీగా బిహేవ్ చేస్తుంది ."

  బ్రేక్ అప్ కు ముందు ...బిపాసా ఇలా కామెంట్ చేసింది..

  " నేను మళ్లీ నిజంగా ప్రేమలో పడితే కనుక దీని గురించి మాట్లాడను..తొమ్మిది సంవత్సరాల జీవితం జోక్ కాదు. జనాలు చదువుకోవటానికి మాత్రమే ఇది ఇంట్రస్టింగ్ విషయం.". అయితే ఇప్పుడు అదే మాట మీద ఉందా అనేది ఆలోచించాల్సిన ఆమె ఆలోచించుకోవాల్సిన విషయం.

  ఓ ఛాట్ షో లో , తన కుమారుడు ఏ అమ్మాయితో సెటిల్ అయినా సంతోషపడతానని,తాను కలగచేసుకోనని, అలాగే బిపాసా ను తాను చాలా ఇష్టపడతానని అన్నాడు.

  జాన్ తల్లి ఏమంటోందంటే...తనకు వచ్చే కోడలు హోమ్లీగా,కేర్ గా ఉండాలని చెప్తోంది. అలాగే తన కుమారుడ్ని పూర్తిగా అర్దం చేసుకుని మెలగాలని చెప్తోంది. ఆమె మాటల్లో...బిపాసా విషయాన్ని ఆమె పూర్తిగా మర్చిపోయినట్లే కనిపిస్తోంది.

  జాన్ ప్రస్తుతం ఇన్వెస్టిమెంట్ బ్యాంకర్ ప్రియ రిచిల్ ని డేటింగ్ చేస్తున్నారు. బిపాసా మాత్రం తాను ఒంటిరిగా ఉన్నానని చెప్తోంది.


  పదేళ్లుగా కలిసి సహజీవనం చేస్తూ అన్నిసుఖాలను అనుభవిస్తున్న బిపాస-జాన్ అబ్రహాం ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. ఏమైందని బిపాసను అడిగితే ఎప్పడూ కలిసే ఉండాలని రూలేమీలేదు కదా...అంటూ గడుసుగా సమాధానం ఇస్తోంది.

  English summary
  Bipasha Basu and John Abraham were in a relation for nine years. They fell in love with each other on the sets of Jism. It is said that Bipasha was dating Dino Morea at that time but she broke up with him after meeting John. Just when their fans were thinking that they will get married soon, John and Bipasha announced their break up.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X