twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీరు చూడని లుక్ : ప్రభాస్ రాజసం (ఫోటో)

    By Srikanya
    |

    హైదరాబాద్: పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు కొందరకి పుట్టుకతోటే రాజస లక్షణాలు వచ్చేస్తాయి. ప్రభాస్ అంతే...చిన్నప్పుడు మెళ్లో పులిగోరు...పంచె కట్టు, క్రింద షూష్ తో ఇదిగా ఇలా ముద్దొచ్చేలా స్టిల్ ఇచ్చాడు. చైల్డ్ హుడ్ మెమరీస్ లో భాగంగా ఈ ఫోటో బయిటకు వచ్చింది. బాహుబలి ప్రభాస్ ...చిన్నప్పటి లుక్ ని చూసి ఎంజాయ్ చేయండి.

    ప్రస్తుతం ప్రభాస్ సర్జరీ చేయించుకుని రెస్ట్ లో ఉన్నారు. ఈ విషయమై ప్రభాస్ స్పందిస్తూ... 'నేను ఒక నెల క్రితం షోల్డర్ సర్జరీ చేసుకున్నాను. చాలా రోజుల క్రితమే చేసుకోవాల్సిన ఈ సర్జరీని చాలా ఆలస్యం చేసి ఇప్పుడు చేసుకున్నాను. సర్జరీ విజయవంతంగా జరిగింది. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను. మరో నెల రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటాను' అని చెప్పారు.

    Unseen Royal look of Prabhas Photo

    ఇక బాహుబలి ప్రాజెక్టు ప్రారంభం నుంచీ ప్రభాస్ బరువులో మార్పు వస్తోంది. ఆరు నెలల క్రితం 82 కేజీలు ఉన్న ప్రభాస్ ఇప్పుడు 102 కేజీలకు చేరుకున్నాడని సమాచారం. హీరోలు సాధారణంగా బరువు తగ్గించుకుంటారు..కానీ బరువు పెరగటమేంటి అనిపిస్తోందా...ప్రభాస్ ది వ్యాయామాలతో పెరిగిన జిమ్ బాడీ.

    రాజమౌళి చిత్రంలో క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఆయన ఇలా పెరిగారు. అందులో ఆయన శివుడుగా, బాహుబలిగా రెండు పాత్రలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన చాలా కఠినమైన వ్యాయామాలు చేయటమే కాక, ఆహార పరంగానూ నియమాలు పాటించారని చెప్తున్నారు. గత వేసవి నుంచే ఈ బరువు పెంచటం మొదలెట్టారని తెలుస్తోంది. అందుకోసం ఆయన ఆహారం లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.

    ఇందుకోసం ఆయన యూ ఎస్ వెళ్లి,అక్కడ రెజ్లర్స్ ట్రైనింగ్ తీసుకునే పద్దతని తెలుసుని,నియమాలు తెలుసుకుని వచ్చారట. తన బాడీని బిల్డ్ చేయటం కోసం వారి శారీరక బాషను,వర్కవుట్స్ ని గమనించి వచ్చారు ప్రభాస్. వాటికి సంభందించిన పరికరాలు దాదాపు కోటిన్నర రూపాయలు ఖర్చుపెట్టి కొన్నాడని తెలుస్తోంది. ఆ జిమ్ సామగ్రి మొత్తం తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న జిమ్ లో ఏర్పాటు చేసుకుని, ట్రైనర్ ని పెట్టుకున్నారు.

    అలాగే ప్రభాస్ ఆహారంలోనూ పూర్తి మార్పులు తెచ్చారు. దాదాపు రోజుకు నలభై కోడి గుడ్డు వైట్స్ తీసుకునేవారు. దానితో కలిపి ప్రొటీన్ పౌడర్ కలిపి తీసుకున్నారు. అలాగే రోజూ దాదాపు ఆరు గంటలు పాటు వర్కవుట్ చేసి మరీ షేప్ తెచ్చుకున్నారు. అదే మనం బాహుబలిలో చూడబోయే లుక్.

    English summary
    Here is the exclusive childhood picture of the one and only Prabhas .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X