VJ Sunny: రివ్యూ రైటర్స్ పై బిగ్ బాస్ సన్నీ ఆగ్రహం.. దమ్ముంటే సినిమా తీయండి అంటూ..
ఈ మధ్యకాలంలో కొంతమంది నటులు ఎక్కువగా సినిమాలకి రివ్యూలు రాసేవారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. ఏదైనా వారు నటించిన సినిమా రిలీజ్ తర్వాత ఫ్లాప్ అయితే రివ్యూ రైటర్స్ వారికి అనిపించింది వెబ్ సైట్స్ లో రాస్తారు. అయితే ఈ రివ్యూలు అందరూ ఫాలో అవుతారని లేదు.
కొంత మంది మాత్రం రివ్యూలు చూసే సినిమాలకి వెళ్తారు అని మరికొందరి వాదన. అయితే రీసెంట్ గా బిగ్ బాస్ విన్నర్ VJ సన్నీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అతను రివ్యూలపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

రివ్యూలు ఎంత చెత్తగా ఇచ్చినా: అయితే ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాల విషయంలో కూడా రివ్యూ రైటర్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ కారణంగా థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసేవారు తగ్గిపోతున్నారనే కామేంట్స్ వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలకి రివ్యూలు ఎంత చెత్తగా ఇచ్చిన ప్రేక్షకులు మాత్రం మౌత్ టాక్ తో సూపర్ హిట్ చేస్తారు. అయితే సినిమాలకి మొదటి రోజు మొదటి ఆట పడగానే ఆ చిత్రం బాగుంది లేదు అనే విషయాన్ని బయట పెట్టడం వలన కొన్ని సినిమాలకి ఆదరణ తగ్గిపోతుందనేది కొంతమంది హీరోల అభిప్రాయం.

అన్ స్టాపబుల్ మూవీతో వచ్చిన సన్నీ: ఇప్పుడు ఆ జాబితాలోకి బిగ్ బాస్ ఫేమ్ హీరో సన్నీ వచ్చి చేరారు. రీసెంట్ గా అతను హీరోగా చేసిన అన్ స్టాపబుల్ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మేగ్జిమమ్ వెబ్ సైట్స్ అన్ని నెగిటివ్ రివ్యూలే ఇచ్చాయి. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి మరీ సన్నీ సీరియస్ అయ్యారు. సినిమా అనేది కొన్ని వందల మంది కష్టం, నెలల తరబడి, ఏళ్ల తరబడి చేస్తే సినిమా తయారవుతుంది. దానిని ఒక్క షో చూసి బాగోలేదని డిసైడ్ చేసేస్తారు.

దమ్ముంటే సినిమా తీయండి: రివ్యూ రైటర్ లు దమ్ముంటే ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా కోసం కష్టపడి, మూవీ తీసి తరువాత రివ్యూలు రాయండి అప్పుడు మీకు సినిమా వాళ్ళ కష్టం ఏంటనేది తెలుస్తుంది. దమ్ముంటే మీరు సినిమా తీసి చూపించండి అంటూ సన్నీ సవాల్ చేశారు.
ఎక్కడో ఏసీ గదిలో కూర్చొని నీకు నచ్చింది రాయడం చాలా తప్పుడు. అలాగే ప్రేక్షకులు కూడా రివ్యూలు చూసి సినిమాలకి వెళ్లొద్దు. మీకు వెళ్లాలని అనిపిస్తే వెళ్ళండి. నచ్చలేదా మానేయండి. నాలుగు సినిమాలు చేయడానికి నాలుగు సంవత్సారాలు పడుతుంది.

ఎంతో మంది పొట్ట కొడుతున్నారు: వాడెవడో నాలుగు నిమిషాల్లో ఆ నాలుగు సినిమాల రివ్యూలు రాసేశాడు. ఆర్టిస్ట్ కష్టం ఆర్టిస్ట్ కి తెలుస్తుంది. దీని మీద ఎంతో మంది బ్రతుకుతున్నారు. ఇలా రివ్యూలు అంటూ మీకు నచ్చినట్లు రాసేసి ఎంతో మంది పొట్ట కొడుతున్నారు. మేము ఇండస్ట్రీలో బ్రతకడానికి వచ్చాం. ఇక్కడే ఉంటాం ఒక సినిమా పోతే మళ్ళీ సినిమాతోనే సమాధానం చెబుతాం అంటూ సన్నీ తన అసహనాన్ని మీడియా ముందు వెళ్ళగక్కాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











