Unstoppable: బాలకృష్ణతో అల్లు అర్జున్ హాల్ చల్.. డేట్ కూడా వచ్చేసింది!

కేవలం మాస్ హీరోగానే కాకుండా నందమూరి బాలకృష్ణ ఒక ఒక ప్రత్యేకమైన హోస్ట్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. ఓటీటీ సంస్థ ఆహా షోలో ఇటీవల నందమూరి బాలయ్య మొదలుపెట్టిన టాక్ షో అన్‌స్టాపబుల్ కు మంచి క్రేజ్ దక్కింది. ప్రతిసారి ఒక కొత్త రకమైన గెస్ట్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఏ మాత్రం బేధాలు చూపకుండా నందమూరి బాలకృష్ణ అందరు హీరోలతో చాలా స్నేహంగా ఉంటారు అని ఈ షో ద్వారా ప్రత్యక్షంగా రుజువవుతోంది. బాలయ్య హడావిడి, స్నేహం ఎలా ఉంటుందో కూడా జనాలకు అర్థం అవుతోంది. ఇక త్వరలో అల్లు అర్జున్ తో కూడా బాలయ్య సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన డేట్ కూడా ఫిక్స్ అయింది.

 అంతకు మించి అనేలా ఎంటర్టైన్మెంట్

అంతకు మించి అనేలా ఎంటర్టైన్మెంట్


అన్‌స్టాపబుల్ విత్ NBK రోజురోజుకు జనాల్లో మరింత క్రేజ్ అందుకుంటోంది. కేవలం సినీ హీరోలు మాత్రమే కాకుండా దర్శకులు సంగీత దర్శకులు ఇతర టెక్నీషియన్స్ కూడా బాలయ్య తో సందడి చేస్తున్నారు. ఇదివరకే పలు రియాలిటీ షోలలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న బాలయ్య ఏ విధంగా సందడి చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అన్‌స్టాపబుల్ ద్వారా అంతకు మించి అనేలా మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు.

 కాంట్రవర్సీ విషయాలను కూడా

కాంట్రవర్సీ విషయాలను కూడా


ఇక స్టార్ హీరోలను దర్శకులను నందమూరి బాలకృష్ణ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ఓపెన్ గానే అడిగేస్తున్నారు. అవసరమైతే కడిగిపారేస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక కాంట్రవర్సి విషయాలను కూడా ఏ మాత్రం దాచకుండా టచ్ చేస్తుండడం విశేషం. ప్రతి సెలబ్రిటీ లోనే కాంట్రవర్సీ విషయాన్ని కూడా నందమూరి బాలకృష్ణ చాలా సున్నితంగా అడుగుతున్నారు.

 రవితేజ.. గోపిచంద్..

రవితేజ.. గోపిచంద్..


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా నందమూరి బాలకృష్ణ ఒక ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్ ను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే రవితేజతో ఒక ఎపిసోడ్ ను పూర్తి చేసిన విషయం తెలిసిందే.. దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఆ ఎపిసోడ్ లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ప్రోమో కూడా ఇటీవల విడుదలవ్వగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

 అల్లు అర్జున్.. డేట్ ఫిక్స్

అల్లు అర్జున్.. డేట్ ఫిక్స్


త్వరలోనే అల్లు అర్జున్ తో కూడా నందమూరి బాలకృష్ణ సందడి చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే మొదట్లో ఈ విషయాన్ని అభిమానులు పెద్దగా నమ్మలేదు. కానీ ఆహా నుంచి క్లారిటీ రావడంతో ఇప్పుడు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇక ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కూడా అఫీషియల్గా క్లారిటీ ఇచ్చేశారు. డిసెంబర్ 25వ తేదీన ఆహాలో ప్రసారం కాబోతున్నట్లు వివరణ ఇచ్చారు.

Recommended Video

Akhanda Success Tour : Nandamuri Balakrishna, Boyapati Srinu హల్చల్
సుకుమార్ కూడా..

సుకుమార్ కూడా..

ఇప్పటికే షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాకుండా దర్శకుడు సుకుమార్ కూడా బాలయ్యతో సరదాగా మాట్లాడబోతున్నట్లు సమాచారం. ఇక పుష్ప సినిమాకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కు మరింత బస్ క్రియేట్ చేసే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X