‘వెన్నుపోటు’పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు: ఆయనకు కొడుకును కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటసింహం

తెలుగు సినీ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలంతా కొంత కాలంగా సరికొత్త ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. సినిమాల పరంగానే కాదు.. కెరీర్‌లో మరింత ముందుకు సాగేందుకు మరికొన్ని మార్గాల్లో పయణిస్తున్నారు. ఇలానే కొంత మంది స్టార్లు హోస్టులుగా కూడా మారిపోతున్నారు. అలా ఈ మధ్య కాలంలో టాక్ షోను నడిపించేందుకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ.
ఆయన ఆహా సంస్థ కోసం Unstoppable with NBK అనే షో చేస్తున్నారు.

రాబోయే ఎపిసోడ్ కోసం 'అఖండ' చిత్ర యూనిట్ ఈ షోకు వచ్చింది. ఆ సమయంలో బాలయ్య వాళ్లతో సందడి చేశారు. అలాగే, వెన్నుపోటు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీకోసం!

‘అఖండ'తో సక్సెస్ కొట్టిన బాలయ్య

‘అఖండ'తో సక్సెస్ కొట్టిన బాలయ్య

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రమే 'అఖండ'. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్‌ ఇందులో హీరోయిన్‌. శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది.

అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే షోతో అలా

అన్‌స్టాపబుల్‌ విత్ ఎన్‌బీకే షోతో అలా

వయసు మీద పడుతున్నా ఉత్సాహంగా కనిపించే నందమూరి బాలకృష్ణ.. అరవై ఏళ్ల ఏజ్‌లోనూ ప్రయోగాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'Unstoppable with NBK' అనే టాక్ షోతో ఓటీటీలోకి వచ్చారు. ఆహా సంస్థ దీన్ని రూపొందించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ టాక్ షోను గ్రాండ్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

రెండు ఎపిసోడ్స్.. సూపర్ సక్సెస్‌ఫుల్

రెండు ఎపిసోడ్స్.. సూపర్ సక్సెస్‌ఫుల్

'Unstoppable with NBK' టాక్ షో రెండు ఎపిసోడ్లను త్వరత్వరగా పూర్తి చేసుకుంది. మొదటి దానికి మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, మంచు విష్ణులు గెస్టులుగా వచ్చారు. రెండో ఎపిసోడ్‌కు నేచురల్ స్టార్ నాని వచ్చాడు. ఈ రెండింటికీ నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ టాక్‌ షోకు చాలా క్లిక్కులు దక్కడంతో సూపర్ డూపర్ హిట్ అయింది.

సర్జరీ తర్వాత మూడో ఎపిసోడ్ కూడా

సర్జరీ తర్వాత మూడో ఎపిసోడ్ కూడా


ఆహాలో 'Unstoppable with NBK' టాక్‌ షోను ప్రతి శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యేలా ప్లాన్ చేశారు. దీంతో ప్రతి శుక్రవారం ఎపిసోడ్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అది మాత్రం జరగలేదు. బాలయ్యకు సర్జరీ జరగడంతో గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలోనే చిన్న విరామం తర్వాత బ్రహ్మానందం, అనిల్ రావిపూడితో గత శుక్రవారమే మూడో ఎపిసోడ్‌ను స్ట్రీమ్ చేసేశారు.

‘అఖండ' టీమ్‌తో అన్‌స్టాపబుల్‌గా

‘అఖండ' టీమ్‌తో అన్‌స్టాపబుల్‌గా

ఆరంభంలోనే సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకున్న 'Unstoppable with NBK' నాలుగో ఎపిసోడ్‌లో భాగంగా తాజాగా అఖండమైన విజయాన్ని అందుకున్న 'అఖండ' టీమ్ రాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా వదిలారు. ఇందులో బోయపాటి శ్రీను, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, థమన్‌లతో కలిసి బాలయ్య ఓ రేంజ్‌లో రచ్చ చేసినట్లు చూపించారు.

వెన్నుపోటుపై బాలయ్య కామెంట్స్

వెన్నుపోటుపై బాలయ్య కామెంట్స్


'Unstoppable with NBK' నాలుగో ఎపిసోడ్‌కు సంబంధించి అఖండ టీమ్‌తో బాలయ్య పలు రకాల గేమ్స్ ఆడించి సందడి చేశారు. దీంతో ఈ ప్రోమో ఆద్యంతం ఫన్నీగా సాగింది. అయితే, చివర్లో మాత్రం ఇది ఎమోషనల్‌గా ఎండ్ అయింది. దీనికి కారణం ఇందులో నందమూరి బాలకృష్ణ 'వెన్నుపోటు' ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోవడమే.

Recommended Video

Vishal చర్య ప్రతీ Star Hero కి పాఠం.. ఇదీ కదా హీరోయిజం అంటే || Filmibeat Telugu
ఆయన కుమారుడిని మాత్రమే కాదు

ఆయన కుమారుడిని మాత్రమే కాదు

'Unstoppable with NBK' ప్రోమో చివర్లో బాలయ్య మాట్లాడుతూ.. 'ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. వెన్నుపోటు పొడిచారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెబుతుంటే కళ్లలో నీళ్లు వస్తుంటాయి. ఎందుకంటే నేను ఆయన కొడుకుల్లో ఒకడిని మాత్రమే కాదు.. అంతకు మించి ఆయన అభిమానిని' అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X