మహేష్ పెళ్లి సీక్రెట్ పై బాలయ్య కూపీ… మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరంటూ బాలయ్యకు కౌంటర్!

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే' షో ఆహా ఓటీటీలో బంపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో దిగ్విజయంగా మొదటి సీజన్ ముగింపుకు చేరింది. ఇప్పటికే 9ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ షో మొదటి సీజన్ ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేందుకు రంగం సిద్ధం అయింది. పదో ఎపిసోడ్ మహేష్ బాబుతో చేయగా దానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఆ ప్రోమోలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మహేష్. ఆ వివరాలు

 గ్రాండ్‌ ఫైనల్ ఎపిసోడ్‌

గ్రాండ్‌ ఫైనల్ ఎపిసోడ్‌

'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే' గ్రాండ్‌ ఫైనల్ ఎపిసోడ్ లో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సందడి చేయనున్నారు. ఆయనతో పాటు డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి సైతం విచ్చేశారు. ఈ గ్రాండ్‌ ఫైనల్ ఎపిసోడ్‌ ఫిబ్రవరి 4న 'ఆహా'లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ ఎపిసోడ్‌కి సంబంధించి వరుస ప్రోమోలు విడుదల చేస్తున్నారు.

ఇంకెవరూ చెప్పలేరు

ఇంకెవరూ చెప్పలేరు

మహేష్ బాబుని చూసిన బాలయ్య.. షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఇంత యంగ్‌గా ఉన్నావేంటయ్యా బాబూ అని ఆశ్చర్యంగా అడగ్గా.. మహేష్ బాబు తెగ సిగ్గుపడిపోయాడు. ఆ తరువాత 'మహేష్... నాది ఒక చిన్న కోరిక. నా డైలాగ్ నీ గొంతులో వినాలని ఉందయ్యా' అని బాలకృష్ణ అడిగితే... 'మీ డైలాగ్ మీరు తప్ప ఇంకెవరూ చెప్పలేరు' అని మహేష్ సమాధానం ఇచ్చారు. హీ

నాటీ కిడ్‌

నాటీ కిడ్‌

ఇక 'చిన్నప్పుడు నువ్ చాలా నాటీ కిడ్‌ అని విన్నాను.. చేసేవన్నీ చేస్తుంటావ్.. మళ్లీ సిగ్గుపడతావ్' అని బాలయ్య పంచ్ వేయడంతో.. దానికి కూడా నవ్వేశారు మహేష్ బాబు. ఇక మహేష్ బాబు.. కెరియర్ బ్రేక్‌ గురించి సీరియస్ ప్రశ్న వేశారు బాలయ్య. 'నెం.1 స్టార్‌వి అయ్యావ్.. సూపర్ స్టార్‌వి అయిపోయావ్.. సడెన్‌గా ఓ మూడేళ్లు గ్యాప్ తీసుకున్నావ్.. ఎందుకు? అని అడిగారు.

ఏంటా సీక్రెట్?

దానికి మహేష్ బాబు.. 'నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి తీసుకున్నానండీ.. ఆ తర్వాత మళ్లీ తిరిగి ఆలోచించలేదు' అంటూ సమాధానం ఇచ్చారు మహేష్ బాబు. ఇక ప్రోమో చివర్లో మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ సీక్రెట్ మ్యారేజ్ గురించి కూడా కూపీ లాగే ప్రయత్నం చేశారు బాలయ్య. 'వెకేషన్ అని చెప్పి వెళ్లి పెళ్లి చేసుకున్నారు.. ఏంటా సీక్రెట్' అని అడిగాడు బాలయ్య. అయితే మహేష్ బాబు.. ఏం చెప్పలేదు. మ్యారేజ్ సీక్రెట్ తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందేనేమో.

 రెండో సీజన్ కూడా

రెండో సీజన్ కూడా

ఇక మహేష్ బాబు ఎపిసోడ్‌తో 'అన్‌స్టాప‌బుల్‌' తొలి సీజ‌న్‌ పూర్తి కానుంది. ఈ ఎపిసోడ్‌లో మ‌హేష్‌తో పాటు ఆయన హీరోగా నటించిన 'మహర్షి' సినిమాకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి కూడా అతిథిగా వచ్చినట్టు గత ప్రోమోలో తేలింది. ఇక ఫిబ్రవరి 4న రాత్రి 8 గంటలకు మహేష్ బాబు ఎపిసోడ్ 'ఆహా' ఓటీటీలో ప్రీమియర్ కానుంది. రెండో సీజన్ కు కూడా రంగం సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. చూడాలి ఆ సీజన్ ఇంకెంత వైవిధ్యంగా ఉండనుందనేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X