»   » అఖిలేష్ యాదవ్ ని కలిసిన రామ్ చరణ్ (ఫోటో)

అఖిలేష్ యాదవ్ ని కలిసిన రామ్ చరణ్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసినప్పుడు వారి మధ్య రాజకీయ అంశాలు కాకుండా సినిమా విషయాల పైన కూడా ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. అఖిలేష్ యాదవ్ విధ్యార్దిగా మైసూర్ లో చాలా కాలం ఉన్నారు. అప్పుడు ఆయన చిరంజీవి సినిమాలు చాలా చూసారట...ఆ విషయాన్ని స్వయంగా తెలియచేసారు.

ఆ సమయంలో శ్రీ అఖిలేష్ ను హీరో రామ్ చరణ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకోవటం జరిగింది. అమితాబ్ జంజీర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, రాబోయే జంజీర్ లో నటించిన రామ్ చరణ్ కు అభినందనలు తెలియచేస్తూ...సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.

అంతేకాకుండా శ్రీ అఖిలేష్ యాదవ్ చిరంజీవి నివాసాన్ని ఆసక్తిగా పరిశీలిస్తూ...హైదరాబాద్ మొత్తాన్ని వీక్షించే అవకాశం చిరంజీవిగార ఇంటికి ఉండటం గొప్ప విషయం అన్నారు. చిరంజీవి ఇంట్లో నలుగురు ప్రజాప్రతినిధుల ఉన్నారని ఛలోక్తిగా అన్నారు. రామ్ చరణ్ ..శ్రీ అఖిలేష్ కు అభినందనలు తెలియచేసారు.

English summary
Uttar Pradesh Chief Minister Akhilesh Kumar Yadav met Union Tourism Minister Chiranjeevi at his house in Hyderabad. He came to Hyderabad to participate in All India Yadav conclave to be held today. When Akhilesh met Chiranjeevi, Ministers Ganta,Vatti Vasanta Kumar and PCC chief Botsa Satyanarayana was present.Akhilesh even met Mega Star Chiranjeevi's son Mega Power Star Ram Charan and even exchanged few pleasantries with him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu