సోనాక్షి సిన్హా ఇంటికి పోలీసులు.. ఛీటింగ్ కేసు నమోదు
హీరోయిన్ సోనాక్షి సిన్హాకు చుక్కెదురైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ మేరకు యూపీ పోలీసులు ఆ కేసును విచారించాల్సిందిగా ముంబై పోలీసులకు ఆదేశించారు. నిన్న (గురువారం) విచారణ నిమిత్తమై యూపీ పోలీసులు, ముంబై పోలీసుల సమక్షంలో సోనాక్షి సిన్హా ఇంటికి వెళ్లారు. అయితే పోలీసులు వచ్చిన సమయంలో సోనాక్షిసిన్హా ఇంట్లో లేకపోవడంతో కాసేపు వేచి చూసి ఆ తరువాత వెనుదిరిగారు. ఈ రోజు (శుక్రవారం) తిరిగి సోనాక్షి సిన్హా ఇంటికి పోలీసులు వెళ్లనున్నారని సమాచారం.
2018 సంవత్సరంలో ఓ స్టేజ్ షోకి రావడానికై ఆ షో నివాహకుల వద్ద 24 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకుందట సోనాక్షి. అయితే ఆ తర్వాత ఆమె ఈ కార్యక్రమానికి హాజరు కాలేదట. ఈ మేరకు తాజాగా సదరు షో నిర్వాహకులు యూపీలోని కట్‌ఘర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వారిచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు హీరోయిన్ సోనాక్షిసిన్హాపై ఐపీసీ సెక్షన్ 420, 406 ల కింద చీటింగ్ కేసు నమోదు చేశారు.

ఈ ఛీటింగ్ కేసును దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఓ పోలీసు బృందం గురువారం సాయంత్రం ముంబైలోని సోనాక్షిసిన్హా ఇంటికి వెళ్లారని తెలిసింది. అయితే ఆ సమయంలో సోనాక్షి ఇంట్లో లేకపోవడంతో ఆమెకు సంబందించిన ఓ వ్యక్తి పోలీసులతో మాట్లాడారు. సోనాక్షి ఎవ్వరినీ చీటింగ్ చేయలేదని, ఇలాంటి ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నాడు. సోనాక్షిసిన్హాపై నమోదు కావడం బాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఇక సోనాక్షి సినిమాల విషయానికొస్తే.. అక్షయ్ కుమార్ సరసన మిషన్ మంగళ్ సినిమాలో, సల్మాన్ ఖాన్ దబాండ్ 3 చిత్రంలో అలాగే మరికొన్ని బాలీవుడ్ సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటిస్తోంది సోనాక్షి సిన్హా.


Click it and Unblock the Notifications











