రాంచరణ్ గురించి ఉపాసన ఇంట్రస్టింగ్ ట్వీట్.. అదేంటి అలా అనేసింది...
మెగా హీరో రాంచరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన యాక్టివిటి గురించి గానీ, రాంచరణ్ గురించి గానీ, ఏదో ఒకటి షేర్ చేస్తుంటారు. తాజాగా రాంచరణ్ ఫొటోను ఉపాసన షేర్ చేయగా.. ప్రస్తుతం అది ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఉపాసన రాంచరణ్ ఫొటో
ఉపాసన షేర్ చేసిన ఫొటోలో రాంచరణ్ తన పెంపుడు కుక్కతో సోఫాలో కూర్చొని, ముసిముసిగా నవ్వుతూ కనిపించారు. రాంచరణ్ ఫొటోను మెగా ఫ్యాన్స్ లైకులతో హడలెత్తిస్తున్నారు.

లవ్ ఆఫ్ మై లైఫ్
ఉపాసాన ఫొటోతోపాటు ‘మిస్టర్ సి, బ్రాట్ (కుక్క పేరు)' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు లవ్ ఆఫ్ మై లైఫ్, రామ్‌చరణ్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జత చేశారు.
వీడియో రూపంలో ఉపాసన కష్టం
అంతకుముందు డెవిల్స్ సర్క్యూట్‌లో పాల్గొన్న వీడియోను ఉపాసన షేర్ చేశారు. అందులో నాజుకుగా తయారయ్యేందుకు పడుతున్న కష్టాన్ని వీడియో రూపంలో అభిమానులకు అందించారు. వచ్చే ఏడాది చాలా ఎనర్జీగా, ఫిట్‌గా ఉంటాను అని చెప్పారు.

రాంచరణ్ ఓ పక్క రంగస్థలం
రాంచరణ్ ఓ పక్క ‘రంగస్థలం 1985' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉంటూనే కొణిదెల బ్యానర్లో రూపొందిస్తున్న సైరా నరసింహరెడ్డి చిత్రంపై దృష్టిపెట్టారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, జగపతిబాబు, అనసూయ, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











