అప్పుడే రాంచరణ్‌ని పెళ్ళిచేకోవాలనుకున్నా.. ఎంత సూపర్ స్టార్ కొడుకైనా.. ఉపాసన!

రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన భర్త రాంచరణ్ ని మిస్టర్ సి అని ముద్దుగా పిలుచుకుంటూ పలు విశేషాలని ఉపాసన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఉపాసన రాంచరణ్ తో పరిచయం, పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. రాంచరణ్ కెరీర్ ఆరంభంలోనే తనతో పరిచయమైనట్లు ఉపాసన తెలిపింది.

 పెళ్ళిచేకోవాలనుకున్నా

పెళ్ళిచేకోవాలనుకున్నా

ఉపాసన మాట్లాడుతూ మా ఇద్దరికీ ఉన్న కామన్ ఫ్రెండ్ ద్వారా తొలిసారి రాంచరణ్ ని కలుసుకున్నా. అప్పుడే రాంచరణ్ నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. నా కెరీర్ కూడా అదే సమయంలో ప్రారంభమైంది. వృత్తి పరంగా ఒకరికి ఒకరం అభినందించుకుంటూ వివిధ విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఆ సమయంలో చరణ్ నాకు చాలా గౌరవం ఇచ్చేవారు. నేను కూడా ఆయన్ని గౌరవించేదాన్ని. కొన్ని రోజుల తర్వాత మా మధ్య దృఢమైన బంధం ఏర్పడ్డట్లు అనిపించింది. అప్పుడే చరణ్ ని పెళ్లి చేసుకోవాలనుకునట్లు ఉపాసన తెలిపింది.

 సూపర్ స్టార్ కొడుకు అయినా

సూపర్ స్టార్ కొడుకు అయినా

రాంచరణ్ క్రేజ్ గురించి మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కొడుకుగా పుట్టినా, అంత క్రేజ్ సొంతం చేసుకున్నా వృత్తి పరంగా కష్టపడాల్సిందే. కష్టపడకపోతే సొంతంగా గుర్తింపు రాదు అని ఉపాసన తెలిపింది. ఎలా సహనంగా ఉండాలో ఆయన నుంచి నేను నేర్చుకున్నా. సంతోషంగా ఎలా ఉండాలో చరణ్ నా నుంచి నేర్చుకున్నారు అని ఉపాసన తెలిపింది. ఉపాసన రాంచరణ్ ఫిట్ నెస్ విషయంలో కూడా తరచుగా కేర్ తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇంట్లో వాటి గురించి

ఇంట్లో వాటి గురించి

వృత్తి ముగించుకుని ఇంటికి వస్తే మాత్రం బయటి విషయాలు చర్చకు రావు. కేవలం కుటుంబపరమైన విషయాలకే ప్రాధాన్యత ఇష్టం అని ఉపాసన తెలిపింది. ఉపాసన, రాంచరణ్ 2012లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన ఈ విషయాలని పంచుకున్నారు.

 రాంచరణ్ బిజీగా

రాంచరణ్ బిజీగా

రాంచరణ్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రంలో రాంచరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోనున్న సంగతి తెలిసిందే. 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాంచరణ్ బ్రిటిష్ కాలం నాటి పోలీస్ గా నటిస్తున్నాడు. స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X