అదే చీర.. అదే నేను.. 14 కేజీలు బరువు తగ్గిన ఉపాసన!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాంచరణ్ కు సంబందించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంటారు. తాను స్వయంగా నిర్వహించే కార్యక్రమాలని కూడా ట్విట్టర్ ద్వారా ఉపాసన వివరిస్తుంది.
తాజాగా ఉపాసన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన పెళ్లినాటి ఫొటో, ఇటీవల ఫోటోని జత చేసి పోస్ట్ చేసింది. అదే చీర..అదే నేను.. కానీ 14 కేజీల బరువు తగ్గా అంటూ కామెంట్ పెట్టింది. అప్పుడూ,, ఇప్పుడూ సంతోషంగానే ఉన్నానని ఉపాసన తెలిపింది.

చాలా రోజులుగా ఉపాసన తన ఫిట్ నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాంచరణ్ తో కల్సి జిమ్ లో వర్కౌట్ చేసిన వీడియోల్ని కూడా అభిమానులతో ఉపాసన పంచుకుంది.


Click it and Unblock the Notifications











