రామ్ చరణ్ మదర్ బర్త్ డే.. ట్విట్టర్లో ఉపాసన వినూత్న ట్వీట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తన ప్రొఫెషన్లో బిజీగా ఉంటూనే కొణిదెల ఇంటికోలిగా తన బాధ్యతలు మరవకుండా ఇటు వృత్తిని, సంసారాన్ని బ్యాలెన్స్ చేస్తూ దూసుకెళుతున్నారు. తాజాగా అత్తమ్మ సురేఖ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన వినూత్నంగా ట్వీట్ చేశారు.
సినిమా కుటుంబంలోకి వెళ్లిన తర్వాత ఉపాసన కూడా సినిమాటిక్‌గా ఆలోచంచడం మొదలు పెట్టారు. ఉపాసన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆ ట్వీట్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలియాలంటే ఓ లుక్కేయండి.

ఇటు రామ్ చరణ్ సినిమా ప్రొఫెషన్లో... అటు ఉపాసన అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్‌గా క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుంటారు. అయితే ఎంత బిజీగా ఉన్న ఇద్దరూ ఫ్యామిలీ కోసం టైమ్ కేటాయిస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.
రామ్ చరణ్, ఉపాసన ఇద్దరిదీ ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే. చిన్నతనం నుంచి స్నేహితులైన వీరు.. తమ స్నేహ బంధాన్ని ప్రేమ బంధంగా మార్చుకుని ఆపై దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ జంట ఇటీవల ప్రేమికుల దినోత్సవాన్ని స్పెషల్‌గా జరుపుకున్నారు.


Click it and Unblock the Notifications











