అలా ఉంటేనే చరణ్‌కు ఇష్టం : ఉపాసన

చిన్న నాటి స్నేహితులైన రామ్ చరణ్-ఉపాసన మధ్య గత ఐదేళ్లుగా నడుస్తున్న ప్రేమాయణం చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు వచ్చిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్లో వీరి నిశ్చితార్థ వేడుక పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. జూన్ 13న వీరి వివాహం జరుగుతుందని ఉపసాన తాతయ్య అపోలో ఆస్పత్రుల అధినేత ప్రతాప్ సి రెడ్డి కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. చిరంజీవి తరుఫున తిరుపతి, తమ తరఫున అరగొండలో రిసెప్షన్ నిర్వహిస్తామన్నారు. పెళ్లి ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నామని, తనకు తిరుపతి పుట్టినిల్లు లాంటిదని చిరంజీవి చెప్పడంతో వెంకన్న చెంతనే రిసెప్షన్‌ను తన స్వగ్రామమైన అరగొండలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన విసయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











