RRR ప్రెస్ మీట్ గురించి ఉపాసన సరదాగా.. ఎన్టీఆర్ భార్యతో!

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి గురువారం మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి రాజమౌళి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. కథ గురించి ఆసక్తికర విషయాలు చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రాంచరణ్ అల్లూరి సీతారామారాజుగా, జూ. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించనున్నట్లు వివరించాడు. వీరిద్దరూ యుక్తవయసులో కొన్నేళ్ల పాటు అదృశ్యమవుతారు. ఆ పాయింట్ ఆధారంగా ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు రాజమౌళి వివరించారు.

ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ మీడియా సమావేశం గురించి ఉపాసన సోషల్ మీడియా వేదికగా సరదాగా స్పందించింది. మీడియా సమావేశంలో చరణ్, ఎన్టీఆర్ మాట్లాడుకుంటున్నా ఫోటోని పోస్ట్ చేసింది. ఆ ఫోటోతో పాటు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతితో తాను కలసి ఉన్న ఫోటోని ఉపాసన షేర్ చేసింది. దీనికి స్వాతంత్ర సమరయోధులు వారి పీస్ ఫుల్ వైవ్స్ అంటూ కామెంట్ పెట్టింది.

Upasana interesting comments on RRR press meet

ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఈ చిత్రం ద్వారా ఇద్దరు బాలీవుడ్ నటులు తొలిసారి తెలుగులో నటించబోతున్నారు. రాంచరణ్ కు జోడిగా రాజమౌళి క్రేజీ బ్యూటీ అలియా భట్ ని ఎంపిక చేశాడు. ఇక స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ చిత్ర ఫ్లాష్ బ్యాక్‌లో కీలక పాత్ర పోషించబోతున్నట్లు రాజమౌళి తెలిపారు. వీరిద్దరికి ఇదే తొలి తెలుగు చిత్రం. ఇక ఎన్టీఆర్ కు జోడిగా రాజమౌళి బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంపిక చేయడం విశేషం. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేయనున్నట్లు దానయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X