ఉపాసన కామినేని బాగా రొమాంటిక్
రామ్ చరణ్ తన కాబోయే భార్య ఉపాసన గురించి మీడియా మాట్లాడుతూ...ఖచ్చితంగా చెప్పాలంటే మా ఇద్దరిలో ఉపాసనే బాగా రొమాంటిక్. అలాగే మా ఇద్దరి మధ్యా అప్పుడప్పుడూ ఒపినియన్స్ లో డిఫెరెన్సెస్ వస్తూంటాయి. కానీ ఉపాసనే ఎప్పుడూ ఆర్గ్యుమెంట్ ని బ్రేక్ చేసి మళ్లీ మామూలు వాతావరణం నెలకొల్పేలా చేస్తుంది. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు రామ్ చరణ్ తేజ. ఆయన రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఉపాసన ఎప్పుడూ నాకెప్పుడూ యాక్టింగ్ గురించి సలహాలు ఇవ్వదు. మా వృత్తులు గురించి మేమెప్పుడూ మాట్లాడుకోం. ఇద్దరం కలిసి సినిమాలు చూస్తూంటాం. అయితే ఇద్దరం కలిసినప్పుడు మాత్రం సినిమా గురించి మాట్లాడుకోం అన్నారు. ఇక మేమిద్దరం పర్శనాలిటీల పరంగా ఉత్తర దక్షిణ ధృవాల లాంటివాళ్లం.
అదే మమ్మల్ని కలిపి ఉంచేది అని నేను భావిస్తూంటాను. మేమిద్దరం ఇద్దరం విభిన్నమైన వ్యక్తులం కాబట్టే మేము మాకు ఎప్పుడూ బోర్ కొట్టం అని అనుకుంటున్నాను. నేను ఓ రిజర్వ్ గా ఉండే వ్యక్తిని, కానీ ఉపాసన నన్ను దాన్నించి తప్పించగలదు. ఆమె చాలా ఓపెన్ గా మాట్లాడే వ్యక్తి. అందుకేనేమో మేము ఒకరికొకరు నచ్చాం. ఇద్దరం ఆలోచనలు కలిసిపోయాయి. అందుకే మా ప్రేమ ప్రయాణం సజావుగా సాగుతోంది అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం రచ్చలో బిజీగా ఉన్నారు. తన పెళ్ళి సమయానికి తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు పెండింగ్ ఉండకూడదు అని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











