సానియా కొడుకుతో ఉపాసన.. విదేశీ వీధుల్లో ఎంజాయ్
Recommended Video
రామ్ చరణ్ సతీమణి ఉపాసన అన్ని విషయాల్లోనూ చాలా యాక్టీవ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. కామినేని వారి ఇంటి నుంచి కోడలిగా మెగా ఇంట అడుగుపెట్టిన ఉపాసన.. బిజినెస్ వ్యవాహారాలు, సామాజిక అంశాలు, స్నేహితులతో తత్సంబందాలు లాంటి వాటిలో ఎప్పుడూ ముందుంటుంది. ఇక రామ్ చరణ్ తోటి హీరోలు ఎన్టీఆర్, మహేష్ కుటుంబాలతో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో ఉపాసన చాలా క్లోజ్ రిలేషన్‌షిప్ మెయిన్‌టైన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సానియా కొడుకును ఎత్తుకొని విదేశాల్లో ఎంజాయ్ చేసింది ఉపాసన. వివరాల్లోకి పోతే..

సానియా మీర్జాకు, ఉపాసనకు మధ్య సాన్నిహిత్యం
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు, ఉపాసనకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఈ ఏడాది కొత్త సంవత్సరం రోజున తన భర్త చెర్రీ, సానియా మీర్జాలతో కలిసి మంచు కొండల్లో ఎంజాయ్ చేసింది ఉపాసన. అలాగే రామ్ చరణ్, ఉపాసనలు హైదరాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీని సందర్శించిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్‌లో ప్రపంచ కప్ క్రికెట్
ప్రస్తుతం ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో పాకిస్థాన్ జట్టులో సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కూడా ఉన్నాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌లు తిలకిస్తూ ఇంగ్లాండ్ లోనే ఉంది సానియా. మధ్య మధ్యలో సమయం దొరికినప్పుడల్లా భర్త షోయబ్ మాలిక్, కొడుకు ఇజాన్ తో కలిసి లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది సానియా మీర్జా.

లండన్ వీధుల్లో ఉపాసనతో మీట్
అయితే వ్యాపార పనుల నిమిత్తం లండన్ వెళ్లిన కొణిదెల ఉపాసనకు సానియా ఫ్యామిలీ కలిసింది. ఉపాసన, సానియాల మధ్య ఇదివరకే మంచి స్నేహం ఉండటం కారణంగా సానియాతో కలిసి లండన్ వీధుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది ఉపాసన. సానియా మీర్జా కొడుకు ఇజాన్‌ను ఎత్తుకొని ముద్దులాడింది. బాబుతో సరదా సరదాగా ఆడుకుంది. తాజాగా ఈ ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది ఉపాసన. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉపాసన, రామ్ చరణ్ బిజీ బిజీ
వ్యాపార కార్యక్రమాలతో ఉపాసన బిజీగా ఉండగా.. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా RRR సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. ఈ చిత్రంలో చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి నిర్మాణ పనుల్లో కూడా చెర్రీ బిజీ అయ్యాడు.


Click it and Unblock the Notifications











