ఆ హీరో లోని కొత్త కోణాన్ని చూపించనున్నాం: ఉపాసన ట్వీట్

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన.. సినిమాలు తప్ప మిగితా విషయాల్లో యమ యాక్టీవ్. బేసిక్ గా ఆమె సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో సినీ ఇండస్ట్రీ జోలికి రాకుండా ఇతర సామాజిక కార్యక్రమాల్లో యాక్టీవ్ గా ఉంటూ మెగా కోడలిగా మెప్పు పొందుతున్నారు. ముఖ్యంగా ఫుడ్ అండ్ హెల్త్‌కి సంబంధించి పలు సూచనలు, జాగ్రత్తలు ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఉంటుంది ఉపాసన.

ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే ఈమె ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి 'బిపాజిటివ్' అనే మ్యాగజైన్‌ను కూడా నడిపిస్తోంది. ఇందులో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే సెలబ్రిటీల ఇంటర్వ్యూలను పబ్లిష్ చేస్తూ పాఠకుల్లో స్ఫూర్తి నింపుతోంది ఉపాసన.అయితే ప్రజల నుంచి ఈ మ్యాగజైన్‌ కి వస్తున్న ఆదరణ చూసిన ఉపాసన.. ఇక ఆ సెలెబ్రిటీల ఇంటర్వ్యూలను వీడియోల రూపంలో ప్రేక్షకుల ముందుంచాలని డిసైడ్ అయింది.

Upasana Kamineni shred a sample vedio with Salman Khan

ఈ మేరకు 'బిపాజిటివ్ విత్ ఉపాసన' పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్‌ ప్రారంభించి సెలెబ్రిటీల తాజా తాజా ఇంటర్వ్యూలను అప్ లోడ్ చేస్తోంది.ఇందులో భాగంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేసింది ఉపాసన. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పేర్కొన్న ఈమె..''ఇదీ భాయ్ అంటే. మీ రహస్యాలు మాతో పంచుకున్నందుకు థాంక్యూ సల్మాన్ ఖాన్. సల్మాన్ భాయ్‌లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నాం'' అని ట్యాగ్ చేయడం విశేషం.

ఈ మేరకు ఇంటర్వ్యూకి సంబందించిన పలు క్లిప్స్ కట్ చేసి ఓ షార్ట్ వీడియోను పోస్ట్ చేసింది ఈ మెగా కోడలు. ఎంతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న ఈ వీడియోలో ఉపాసన, సల్మాన్ ఖాన్ చాలా హుషారుగా కనిపించారు. దీంతో కండల వీరుడి ఫిట్‌నెస్ రహస్యాలు, డైట్, హెల్త్‌కేర్ గురించి తెలుసుకోవాలనే ఆత్రుత నెటిజన్లలో నెలకొంది. ఈ వీడియో అతిత్వరలోనే బిపాజిటివ్ విత్ ఉపాసన యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారం కానుంది.

ఇటీవలే భారత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు సల్మాన్ ఖాన్. ఆ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. ఇక ఈయనకు ఉపాసన భర్త, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటూ ఒకరి ఇంటికి వచ్చిపోతుండటం జరుగుతుంటాయి.

More from Filmibeat

Read more about: upasana kamineni salman khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X