ఉపాసన గదిలో స్టార్ హీరో కూతురు.. నేను పర్ఫెక్ట్ కాదు, ఒరిజినల్.. మెగా కోడలి సెన్సేషన్
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన విశేషాలు, మామ చిరంజీవి విశేషాలు, భర్త రామ్ చరణ్ సినిమా సంగతులు చెబుతూ మెగా అభిమానులకు టచ్‌లో ఉండటం ఉపాసన స్టైల్. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అందుకు ఓ కారణం కూడా ఉంది. ఆ వివరాలు చూస్తే..

ఉపాసన ఫొటో.. పరీక్షించి చూస్తే ఆమె
ఉపాసన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఆమె ఓ గదిలో డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా కూర్చొని సెల్ఫీ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. దీనిని మెగా అభిమానులతో పంచుకుంది ఉపాసన. అయితే ఈ ఫొటోలో పరీక్షించి చూస్తే అందులో ఓ స్టార్ హీరో కూతురు కనిపిస్తోంది.

మెగా, సూపర్ స్టార్ అభిమానుల సంబరం
మెగా కోడలు షేర్ చేసిన ఈ ఫొటోలో మేకప్ టేబుల్‌పై మేకప్ కిట్ మధ్యలో ఓ ఫొటో ఫ్రేమ్ కనిపిస్తోంది. అందులో ఉపాసనతో పాటు మహేష్ బాబు గారాలపట్టి సితార కూడా ఉంది. ఓ వేడుకలో భాగంగా మహేష్ కుమార్తె సితారతో కలిసి దిగిన ఫొటో ఇది. దీంతో సితారపై ఉపాసనకున్న ప్రేమను గమనించి మెగా అభిమానులు, సూపర్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ సతీమణి నమ్రత కూడా
పైగా ఉపాసన తన ట్వీట్‌తో పాటు 'నేను పర్ఫెక్ట్ కాదు కానీ, నేను ఒరిజినల్' అని పేర్కొనడం ఆసక్తి కలిగిస్తోంది. ఉపాసన గదిలోని ఫొటో, ఆమె పెట్టిన ఆ ట్యాగ్ లైన్ చూసి అంతా లైకులు వర్షం కురిపిస్తున్నారు. తన కూతురిని ఉపాసన గదిలో చూసి మహేష్ సతీమణి నమ్రత కూడా ఈ ఫోటోను లైక్ చేయడం విశేషం.
Recommended Video
చెర్రీ సినిమాలు.. ఉపాసన బిజినెస్
మరోవైపు సొంతంగా వ్యాపారం, యూట్యూబ్ ఛానెల్ నడిపిస్తున్న ఉపాసన.. పలు హెల్త్ టిప్స్, ఆరోగ్య సూత్రాలు పోస్ట్ చేస్తూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఉపాసన భర్త రామ్ చరణ్ సినిమాలతో బిజీగా ఉంటే, ఉపాసన ఇలా సామాజిక కార్యక్రమాలతో పాటు బిజినెస్ చూసుకుంటూ ఉంటుంది.


Click it and Unblock the Notifications











