మొదట్లో అలా ఉన్నా.. ఏం చేసినా అభ్యంతరం పెట్టేవాళ్లు.. అత్తింటి విషయాలను చెప్పిన ఉపాసన

మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆరోగ్య చిట్కాలు, సామాజిక సమస్యలపై అవగాహన వీడియోలు చేస్తూ అందరికీ దగ్గరైంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు చేరువైంది. ఇలా మెగా కోడలిగా, అపోలో వారసురాలిగా ఇరు బాధ్యతలను నిర్వర్తిస్తూ నిత్యం బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్..

సోషల్ మీడియాలో యాక్టివ్..

ఉపాసన సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. వాటిలో ఎక్కువ శాతం ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలే ఉంటాయి. ఆయుర్వేద పద్దతులు, ఆరోగ్యకర,పోషకాహార వంటలను ఎలా తయారుచేసుకోవాలో చెబుతూ ఉంటుంది.

 సేంద్రియ వ్యవసాయంతో బిజీ..

సేంద్రియ వ్యవసాయంతో బిజీ..

లాక్ డౌన్ సమయాన్ని ఉపాసన బాగానే వాడుకుంది. సేంద్రియ వ్యవసాయంలోని మెలుకువలు నేర్చుకుంది. తండ్రితో కలిసి పొలంలో పనులు చేసింది. ఈ మేరకు పేడ ఎత్తిన ఫోటోలు, ఆవుకు దాన పట్టిన ఫోటోలను షేర్ చేసింది. తాజాగా తాత మరణంపైనా ఎమోషనల్ పోస్ట్ చేసింది.

ఏమీ తోచేది కాదు..

ఏమీ తోచేది కాదు..

తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించింది. పెళ్లైన కొత్తలో అత్తవారింట్లో తనకు ఏమి తోచేది కాదని తెలిపింది. రామ్ చరణ్ ఫ్యామిలీ గురించి తెలిసినా.. ఎలా ప్రవర్తిస్తారో అని తెగ ఫీలయ్యేదాన్నని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అత్తమ్మ సురేఖ..తనను కన్న కూతురిలా చూసుకుందని, దీంతో అత్తవారింట్లో ఉన్న విషయాన్ని మరిచిపోయినట్టు పేర్కొంది.

Recommended Video

Watch : Ram Charan Learning To Make Butter With His Grandmother
 అభ్యంతరం పెట్టేవాళ్లు కాదు..

అభ్యంతరం పెట్టేవాళ్లు కాదు..

ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన కొత్తలో మాత్రం కాస్త భయం భయంగా ఉండేదని, రాను.. రాను.. తనకు అత్త (సురేఖ) ప్రతి విషయంలో ఎంతో సహాయ సహాకారాలు అందిస్తూ వచ్చినట్టు చెప్పుకొచ్చింది. తాను ఏమి చేసినా.. అభ్యంతరం పెట్టేవాళ్లు కాదని పేర్కొంది. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన తాను.. అలాంటి ఉమ్మడి కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టడం సంతోషంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X