twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చైనీస్‌ అని అవమానిస్తారు.. వారు కూడా మన లాంటి ఇండియన్సే.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్

    |

    మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ తెలిసిందే. ఓ వైపు అపోలో బాధ్యతలు, మరోవైపు మెగా ఫ్యామిలీ బాధ్యతలను నిర్వర్తిస్తూ బిజీగా ఉంటుంది. ఇవే కాకుండా సమాజంలోని సమస్యలపై గళమెత్తుతూ, సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. స్వచ్చంద సంస్థల ద్వారా నిరుపేదలకు సాయం చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు ఆరోగ్య చిట్కాలు, ఆయుర్వేద పద్దతులను బోధిస్తూ ఉంటుంది.

    Recommended Video

    Upasana About Northern States People రూపురేఖలు చూసి చైనీస్‌ అంటూ దరిద్రమైన కామెంట్స్ : ఉపాసన ఎమోషనల్
    సేంద్రియ వ్యవసాయంలో మెలుకువలు..

    సేంద్రియ వ్యవసాయంలో మెలుకువలు..

    ఉపాసన ఈ లాక్ డౌన్ సమయంలో కొత్త పద్దతులను నేర్చుకుంది. తండ్రితో కలిసి సేంద్రియ వ్యవసాయంలోని మెలుకువలు నేర్చుకుంది. తండ్రితో పాటు పొలంలో పనులు చేసింది. సాధారణ యువతిలా పేడ ఎత్తి, ఆవుకు దాన పట్టింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

    గిరిజన తెగ ప్రజల మధ్య..

    గిరిజన తెగ ప్రజల మధ్య..


    కోవిడ్ 19 నేపథ్యంలో ఉపాధి కోల్పోయి.. పొట్ట నింపుకోవడం కష్టంగా ఉన్నవారికి అండగా నిలిచింది. అందులో భాగంగా.. మహబూబ్ నగర్, శ్రీశైలం అటవీ ప్రాంతంలో చెంచులు అనే గిరిజన తెగలకు సాయం చేసింది. వారిని కలుసుకుని వారితో తిరిగి వారి ఆహారపు అలవాట్లు జీవన శైలి గురించి కూడా తెలుసుకుంది.

    ఏదో మ్యాజిక్..

    ఏదో మ్యాజిక్..

    ఒత్తిడిలో ఉన్నప్పుడు నా మెడ, భుజాలు బాగా నొప్పి పుడతాయి. సోపెమ్ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఆమెకు థ్యాంక్స్ చెప్పి ఊరుకోలేను. ఈ కోవిడ్ 19 వంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది బ్యూటీషియన్స్, థెరపిస్ట్‌లు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయారు. వారంతా ఉద్యోగం కోసం నాగాలాండ్, మణిపూర్, మిజోరం వంటి ఎక్కడెక్కడి ప్రదేశాల నుంచో వస్తారు.

    చైనీస్ అని అవమానిస్తాం..

    చైనీస్ అని అవమానిస్తాం..


    కానీ కొందరు మాత్రం వారిని చూసి, వారి రూపురేఖలను చూసి దరిద్రమైన కామెంట్స్ చేస్తుంటారు. చైనీస్‌ అంటూ అవమానిస్తారు..అది ఏమాత్రం హర్షించదగ్గ విషయం కాదు. మనందరిలానే వారు కూడా భారతీయులే. నేను వారిని ప్రేమిస్తాను, గౌరవిస్తాను. మన బాధను పోగొట్టే శక్తి వారికి ఉంది. ప్రేమను పంచండి. శాంతంగా ఉండండి. సంతోషంగా ఉండండి.. మీకు చేతనైన సాయం వారికి చేయండ'ని కోరింది.

    English summary
    Upasana Konidela About Therapist From Northern States. she says that My neck & shoulders tense up the most under stress. Sopem has magic in her hands. Can’t thank her enough
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X