స్టార్ వైఫ్స్ ఛాలెంజ్ : సమంత, ఉపాసన పోటాపోటీ... నెక్ట్స్ నమ్రత!
Recommended Video

'హమ్ ఫిట్‌తో హై ఇండియా ఫిట్' అనే ఫిట్‌నెస్ ఛాలెంజ్ ట్విట్టర్లో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. సినీ స్టార్లు, స్పోర్ట్స్ స్టార్లు ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటూ దీనికి మరింత ప్రచారం కల్పించారు. టాలీవుడ్లో స్టార్లు మాత్రమే కాదు... వారి భార్యలు కూడా సై అంటే సై అంటూ ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరిస్తుండటం హాట్ టాపిక్ అయింది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య భార్య, హీరోయిన్ సమంత ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు విసరడం, దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఉపాసన.... వెకేషన్లో ఉన్నప్పటికీ ఈ ఛాలెంజ్ పూర్తి చేయడం గమనార్హం.
హేయ్ సమంత చూస్కో...
హేయ్ సమంత... నేను వెకేషన్లో ఉన్నప్పటికీ నీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించాను అంటూ ఉపాసన ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతే కాదు మహేష్ బాబు భార్య నమ్రతకు ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరారు.

లండన్ వెకేషన్లో ఉన్న చెర్రీ, ఉపాసన
లండన్లోని ప్రఖ్యాత థర్డ్ స్పేస్ మార్లీబోన్ అనే జిమ్‌లో ఉపాసన తన ఫిట్‌నెస్ ఛాలెంజ్ పూర్తి చేసింది. రామ్ చరణ్ కూడా ఉపాసనతో పాటు లండన్లో ఉన్నారు. చెర్రీకి షూటింగ్ గ్యాప్ దొరకడంతో ఇద్దరూ కలిసి వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది.

హీరోల భార్యల మధ్య ఫ్రెండ్షిప్
టాలీవుడ్ టాప్ హీరోలైన మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య మంచి స్నేహం ఉంది. వీరితో పాటు వీరి భార్యలు కూడా ఆయా వేడుకల్లో కలిసి పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య కూడా ఫ్రెండ్షిప్ పెరిగింది. హీరోయిన్ సమంత కూడా ఈ లేడీ గ్యాంగుకు చెందిన వ్యక్తే కావడం గమనార్హం.

నెక్స్స్ నమ్రత వంతు
సమంత నుండి ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన ఉపాసన.... మహేష్ బాబు భార్య నమ్రతతో పాటు, తరుణ్ తహిలియానీ, కనికా కపూర్, పింకీ రెడ్డి, అపోలో లైఫ్ స్టూడియోలోని ట్రైనర్లకు సవాలు విసురుతున్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











