ఉపాసన పుట్టిన రోజు గ్రాండ్ లెవల్లో.. ఆ పనులు చేయాలంటూ రామ్ చరణ్ యువశక్తి పిలుపు!

మెగా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ అభిమానులకు విడదీయలేని సంబంధం ఉంటుంది. మెగా ఫ్యామిలీలో ఎవరి పుట్టినరోజులు వచ్చినా వాటిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు మెగా అభిమానులు. మరీ ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు అలాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అయితే ఒక పండుగకు ఏమాత్రం తక్కువ కాకుండా చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా కొణిదెల ఉపాసన పుట్టిన రోజు వేడుకలు కూడా ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాసన జూలై 20వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని వేడుకలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి కీలక నిర్ణయం తీసుకుంది.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రామ్ చరణ్ యువశక్తి సభ్యులు, మెగా పవర్ స్టార్ అభిమానులు ఆమె పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా తమ దగ్గరలో ఉన్న ఆలయాలలో రామ్ చరణ్, ఉపాసన పేర్ల మీద ప్రత్యేక అర్చనలు చేయించాలని అలాగే అనువైన చోట మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు రామ్ చరణ్ యువశక్తి అలాగే రాంచరణ్ అభిమానులు తీసుకోవాలని కోరారు. అంతేకాక అనాధ శరణాలయాలలో భోజన వితరణ చేయాలని అలాగే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అనేక చోట్ల వరద బీభత్సం కొనసాగుతున్న నేపథ్యంలో వరద వల్ల నష్టపోయిన కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది.

Upasana konidela birth day celebrations in a grand way

రామ్ చరణ్ అభిమానులు మాత్రమే కాక మెగా అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ వాళ్ళ భిన్న గెటప్స్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ద్వారా సరైన హిట్టు అందుకోవాలని రామ్ చరణ్ భావిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X